/rtv/media/media_files/2025/07/24/rajiv-kanakala-2025-07-24-08-23-50.jpg)
Rajiv Kanakala
సినీనటుడు రాజీవ్ కనకాలకు బిగ్ షాక్ తగిలింది. ఫ్లాట్ల్ అమ్మిన వ్యవహారంలో ఆయనకు రాచకొండ పోలీసులు నోటీసులు పంపించారు. అలాగే సినీ నిర్మాత విజయ్ చౌదరిపై హయత్‌నగర్‌లో కేసు నమోదు చేశారు. కొన్ని నెలల క్రితం విజయ్ చౌదరికి రాజీవ్ కనకాల ఫ్లాట్‌ను విక్రయించారు. ఆ ఫ్లాట్‌ను విజయ్ చౌదరి రూ.70 లక్షలకు మరో వ్యక్తికి అమ్మేశారు. అయితే లేని ఫ్లాటును ఉన్నట్లు చూపించి మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు విజయ్‌పై కేసు నమోదు చేసి రాజీవ్‌కు నోటీసులు పంపించారు.
Also Read: పెళ్లమా..? దయ్యమా..? భయ్యా.. భర్త పార్ట్ కొరికి మింగేసింది..
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 421 వెంచర్లో రాజీవ్ కనకాలకు ఓ ఫ్లాటు ఉంది. ఆ ఫ్లాట్‌ను రాజీవ్.. సినీ నిర్మాత విజయ్ చౌదరికి అమ్మేశారు. దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఈ ఫ్లాటును విజయ్ చౌదరి.. ఎల్బీనగర్‌కు చెందిన శ్రవణ్ రెడ్డి అనే వ్యక్తికి రూ.70 లక్షలకు అమ్మేశారు. అయితే ఏడాది క్రితం శ్రవణ్.. తన ఫ్లాటును చూసుకునేందుకు వెళ్లగా.. సదరు నెంబర్ ఫ్లాటు లేకుండా మొత్తం ఆనవాళ్లు చెరిపేశారు.
Also read: ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. EPFO సేవలు మరింత సులభతరం
దీనిపై విజయ్ చౌదరిని సంప్రదించగా ఫ్లాట్ ఇవ్వబోనని.. దీనిపై వివాదం నడుస్తోందని, ఏదైనా ఉంటే కూర్చోని మాట్లాడుకుందామంటూ సమాధానం దాటవేశారు. ఏడాది నుంచి ఫ్లాట్ ఇవ్వనని, మీ అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నాడని బాధితుడు శ్రవణ్ హయాత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ఫ్లాటు విక్రయదారు, సినీ నటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు పంపించారు.