Rajeev Kanakala: చంద్రబాబు అరెస్ట్ పై అందుకే ఎన్టీఆర్ స్పందించలేదు..!!
తారక్ సినిమాలతో బిజీగా ఉండడం వల్లే చంద్రబాబు అరెస్ట్ పై స్పందించలేదనుకుంటా అంటూ నటుడు రాజీవ్ కనకాల వ్యాఖ్యనించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్క కామెంట్ కూడా చేయలేదు. కనీసం సోషల్ మీడియాలోనూ స్పందించని పరిస్ధితి కనిపిస్తోంది. అయితే, ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదంటూ వార్తలు హాల్ చల్ అవుతున్నా..ఎన్టీఆర్ మాత్రం రియాక్ట్ అవ్వడం లేదు.