/rtv/media/media_files/2025/03/11/XFuQiyQEpam7h13Iyajq.jpg)
Payal Rajput marriage
Payal Rajput: రీసెంట్ గా 'మంగళవారం' సినిమాతో హిట్ కొట్టిన హాట్ బ్యూటీ పాయల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు నెట్టింట ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ ముద్దుగుమ్మ పెళ్ళికి ముందే తన కాబోయే వరుడిని చూసి పెట్టుకుంది. అదే ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అతడు మరెవరో కాదు తన చిరకాల స్నేహితుడినే మనువాడబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పంజాబ్ కి చెందిన యాక్టర్, మోడల్, ప్రొడ్యూసర్ సౌరబ్ అనే వ్యక్తిని వివాహం చేసుకోబోతుంది. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. ఇటీవలే పాయల్ సౌరబ్ తో కలిసి ఉన్న కొన్ని క్లోజ్ ఫొటోలను షేర్ చేస్తూ అతడికి బర్త్ డే విషెష్ తెలియజేసింది. దీంతో వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Also Read: అత్యంత దయనీయంగా శ్రీతేజ్ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి
/rtv/media/media_files/2025/03/11/3vGqStBPAdekzNcrWnAd.png)
RX100 తో ఫుల్ ఫేమ్
32ఏళ్ల యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పూత్ 2017లో పంజాబీ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత హిందీ సీరియల్స్ లో నటిస్తుండగా తెలుగులో ఆర్ఎక్స్ 100 మూవీ అవకాశం వచ్చింది. ఈ సినిమాతో పాయల్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా వర్కవుట్ కాలేదు. మళ్ళీ 2023లో 'మంగళవారం' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో పాయల్ తన పాత్ర ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమాలో పాయల్ కు ఉత్తమ నటిగా సైమా అవార్డు వరించింది. పాయల్ తెలుగులో వెంకీ మామ, జిన్నా, డిస్కో రాజా వంటి సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ్ లో రెండు సినిమాలు, తెలుగులో ఒక సినిమా చేస్తోంది. తమిళ్లో గోల్మాల్, ఏంజెల్ తెలుగులో కిరాతక మూవీలో నటిస్తోంది.
ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!