అపాయిట్మెంట్ అడిగితే పవన్ షాకింగ్ రియాక్షన్.. అల్లు అర్జున్ కు ఊహించని షాక్!

అల్లు అర్జున్ జైలు నుంచి బయటికొచ్చాక చిరు, నాగబాబు ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఇదే ఊపులో పవన్ ను కూడా కలవాలని డిసైడ్ అయ్యాడు. తనకు, అటు పవన్‌కు సన్నిహితుడైన త్రివిక్రమ్ ద్వారా అపాయింట్‌మెంట్ కోసం ట్రై చేయగా .. ఇద్దరి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదట.

New Update
pawan123

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ జైలుకెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. అయితే బన్నీ జైలుకు వెళ్లిన సమయంలో, జైలు నుంచి తిరిగొచ్చాక చిరంజీవి కుటుంబం అల్లు అర్జున్కు, అతని కుటుంబ సభ్యులకు మద్దతు తెలిపింది. అందుకు కృతజ్ఞతగా బన్నీ.. మెగాస్టార్ ఇంటికి, నాగబాబు ఇంటికి వెళ్లారు. 

పవన్ నుంచి నో రెస్పాన్స్..

ఇదే ఊపులో పవన్ ను కూడా కలవాలని డిసైడ్ అయ్యాడు. కానీ ఆయన హైదరాబాద్ లో లేరు. దాంతో  మంగళగిరి వెళ్లి పవన్‌ను కలవాలని అనుకున్నారట. ఈ క్రమంలోనే ఇటు తనకు, అటు పవన్‌కు సన్నిహితుడైన త్రివిక్రమ్ ద్వారా అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటిదాకా ఈ ఇద్దరి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదట. 

Also Read : 'ఇండియన్ 2' కి నెగిటివ్ రివ్యూలు.. ఎట్టకేలకు నోరు విప్పిన శంకర్, ఏమన్నారంటే

అలా అని 'నో' అన్న సమాధానం రాలేదు కానీ, పవన్ ప్రస్తుతం పలు సమావేశాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో బన్నీని కలవకలేకపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అల్లు అర్జున్ మాత్రం  పవన్ అపాయింట్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

పవన్ ను కలిసేందుకు బన్నీ ఎంత ట్రై చేసినా.. అటు నుంచిఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ప్రస్తుతం రాజకీయ వర్గాలతో పాటూ సోషల్ మీడియాలోనూ దీని గురించే డిస్కషన్ నడుస్తోంది. ఈ డిస్కషన్ లో పలువురు బన్నీని కలవడం పవన్ కు ఇష్టం లేదని, అందుకే ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజం అనేది తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.

Also Read: ప్రశాంత్ వర్మ - మోక్షజ్ఞ మూవీ క్యాన్సిల్ అయిందా? నిర్మాణ సంస్థ ఏం చెప్పిందంటే

Advertisment
తాజా కథనాలు