/rtv/media/media_files/2025/01/09/ocm9ey7A3ePvtxZpHmvC.jpg)
pawan kalyan OG
పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ మరో ఐదు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా సినిమా నుంచి ఒక్కో అప్డేట్ రివీల్ చేస్తూ ప్రేక్షకుల్లో సినిమాపై ఫుల్ హైపెక్కిస్తున్నారు. ఓజీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. శిల్ప కళావేదిక లేదా ఎల్బీ స్టేడియంలో వేడుకను నిర్వహించనున్నారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరవుతారని వార్తలు వస్తున్నాయి. తెలంగాణాలో ఒకటి, ౠంధ్రాలో ఒకటి చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ట్రైలర్ మరోసారి వాయిదా..
ప్రమోషన్స్ లో స్పీడ్ ను పెంచిన మేకర్స్...ఫ్యాన్స్ కు మాత్రం మారోసారి షాక్ ఇచ్చారు. వారు ఇంతకు ముందు అనౌన్స్ చేసిన ప్రకారం ఈరోజు 10.80 కి ట్రైలర్ రిటీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు దాన్ని మరోసారి పోస్ట్ చేశారు మేకర్స్. OG ట్రైలర్ కోసం పవన్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూసారు. కానీ వారి ఎదురుచూపులకు ఇప్పుడు నిరాశ కలిగించారుఅయితే. ఈరోజు ఉదయం రిలీజ్ కావాల్సిన ట్రైలర్ ను పోస్ట్ పోన్ చేశారు.
ఈరోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఓజీ కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు. ఇదే ప్రీరిలీజ్ ఈ వెంట్. దీని కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఇందులోనే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు నిర్మాత డీవీవీ దానయ్య. దీనిపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమను ఊరించి ఉసురుమనిపించారని, ఫ్యాన్స్ ఎమోషన్స్ తో అడ్డుకోవద్దని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. కాన్సర్ట్ రిలీజ్ చేసే ఉద్దేశం ఉన్నప్పుడు ముందుగానే రిలీజ్ చేస్తామని ఎందుకు చెప్పారని మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
#OG Trailer Postponed to today Evening.. #TheyCallHimOGTrailerpic.twitter.com/ivCEh2fAm4
— Fukkard (@Fukkard) September 21, 2025
ఇది కూడా చూడండి: ఒరే అజము లగెత్తరో.. భారీగా పెరిగిన అమెరికా ఫ్లైట్ టికెట్ల ధరలు.. ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం!