పవన్ 'OG' లో పాన్ ఇండియా హీరో..సినిమాటిక్ యూనివర్స్ ప్లానింగ్ లోసుజిత్

పవన్ కళ్యాణ్ 'OG' మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా భాగం కానున్నారట. 'ఓజి' క్లైమాక్స్ లో ప్రభాస్ ఎంట్రీ ఉంటుందని, ఈ మూవీతో సుజిత్ ఓ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు.

New Update
og

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో 'ఓజీ' (OG) ఒకటి. సాహూ ఫేమ్ సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులలో విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. 

క్లైమాక్స్ లో ప్రభాస్ ఎంట్రీ..

గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటూ పాన్ ఇండియా హీరో కూడా భాగం అవుతున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఆ పాన్ ఇండియా హీరో మరెవరో కాదు మన రెబల్ స్టార్ ప్రభాస్. తాజా సమాచారం ప్రకారం.. 'ఓజి' క్లైమాక్స్ లో ప్రభాస్ ఎంట్రీ ఉంటుందని, ఈ మూవీతో సుజిత్ ఓ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read : టీమిండియా క్రికెటర్ పై కన్నేసిన'బాలయ్య' హీరోయిన్..డేటింగ్ కి రెడీ అంటూ

సుజిత్ తో ప్రభాస్ ఇప్పటికే 'సాహూ' సినిమా చేశాడు. అదికూడా మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీనే. అయితే ఇప్పుడు 'OG' క్లైమాక్స్ లో ప్రభాస్ ఎంట్రీ ఇస్తున్నాడంటే డైరెక్టర్ సుజిత్.. 'OG' తో సాహూ మూవీకి ఏమైనా లింక్ ఉన్నట్లు చూపించి.. ప్రభాస్ తో మరో సినిమా చేస్తున్నాడేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఇదే నిజమైతే ఫ్యాన్స్ లు పండగే అని చెప్పొచ్చు. దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ ఈ చిత్రంలో విలన్ రోల్ ప్లే చేస్తుండగా.. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.   

 Also Read : మూడు వారాలకే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు