OG Day 1 Collections: ప్యూర్ పీకే ఫ్యాన్స్ స్టఫ్.. స్వాగ్ + స్టైల్ + యాక్షన్ = OG

పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన రెండవ సినిమా ‘ఓజీ’ ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్‌ అందించింది. పవన్ స్వాగ్, స్టైల్, యాక్షన్ హైలైట్స్‌గా ఉండగా, సుజీత్ డైరెక్షన్, తమన్ సంగీతం సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. పవన్ వన్ మ్యాన్ షోగా అదరకొట్టేసాడు.

New Update
OG Day 1 Collections

OG Day 1 Collections

OG Day 1 Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలైన రెండవ సినిమా ‘ఓజీ’పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు, ఎందుకంటే మొదటి సినిమా ‘హరిహర వీరమల్లు’ ఆశల్ని నీరుగార్చింది. అయితే ‘ఓజీ’ ఆ అంచనాలను అందుకుంటూ, థియేటర్ల వద్ద పవన్ ఫ్యాన్స్‌కు పండుగ వాతావరణం తీసుకొచ్చింది. ప్రీమియర్ షోలు, మార్నింగ్ షోల నుంచే సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. పవన్ స్టైల్, మాస్ యాక్షన్, హై మూమెంట్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఫ్యాన్స్ థియేటర్లలో అరుపులు, కేకలతో ఊపెత్తుతున్నారు. చాలా కాలం తర్వాత పవన్ మళ్లీ తన మాస్ స్టామినా చూపించడంతో దర్శకుడు సుజీత్‌పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. 'ఓజీ' పవన్‌కు కమ్‌బ్యాక్ సినిమా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సెప్టెంబర్ 24 రాత్రి 10 గంటల ప్రీమియర్ షోస్ తో విడుదలైన ఈ మూవీ ఎలా ఉందొ డీటెయిల్ గా తెలుసుకుందాం 

మూవీ: They Call Him OG
విడుదల: సెప్టెంబర్ 25, 2025
డైరెక్టర్: సుజీత్
హీరో: పవన్ కళ్యాణ్, 
నటీనటులు: ఇమ్రాన్ హష్మీ, ప్రియాంకా మోహన్, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్
మ్యూజిక్: తమన్ ఎస్ ఎస్ 
సినిమాటోగ్రఫీ: రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస
ఎడిటింగ్: నవీన్ నూలి

కథలోకి వస్తే..  

90వ దశకంలో ముంబై పోర్ట్‌ను కంట్రోల్ చేస్తున్న వ్యక్తి సత్య దాదా (ప్రకాశ్ రాజ్). అతని పోర్ట్‌పై కన్నేసిన మిరజ్‌కర్ (తేజ్ సప్రు) తన కుమారుడు జిమ్మీ (సుధేవ్ నైర్) ద్వారా విధ్వంసం సృష్టిస్తాడు. ఓ కంటైనర్ గల్లంతవడంతో పరిస్థితులు అదుపు తప్పిపోతాయి. ఈ కంటైనర్ వెనుక అసలైన మాస్టర్ మైండ్ 'ఓమీ భౌ' (ఇమ్రాన్ హష్మీ) ఉంటాడు.

ఈ పరిస్థితుల్లో, ఒకప్పుడు సత్య దాదాతో కలిసి ఉండి, అనుకోని పరిస్థితులలో సత్య దాదా ని విడిచి దూరంగా బ్రతుకుతున్న  OG అంటే - ఓజస్ గంభీరా (పవన్ కళ్యాణ్)ను మళ్లీ ముంబైకి రప్పిస్తారు. OG ఎవరు? ఆయనకు సత్య దాదాతో ఉన్న బంధం ఏంటి? ఆయన ఎక్కడ ఉన్నాడు? OG రాకతో ముంబైలో ఏం జరుగుతుంది? అనేదే మిగతా కథ. అయితే కథలో భాగంగా సెకండ్ హాఫ్ లో SCU (సుజీత్ సినిమాటిక్ యూనివర్స్) కి సంబంధించి ఒక సర్ప్రైజ్ ఉంటుంది.  

ప్లస్ పాయింట్లు.. 

  • పవన్ కళ్యాణ్‌ను దర్శకుడు సుజీత్ స్టైలిష్, మాస్ లుక్‌తో బాగా డిజైన్ చేశారు.
  • యాక్షన్ సీన్లు (ఇంట్రో ఫైట్, ఇంటర్వెల్ బ్లాక్, పోలీస్ స్టేషన్ సీన్) అన్నీ పవన్ ఫ్యాన్స్‌కి పండుగలా ఉంటాయి.
  • OG టైటిల్ కార్డ్ నుంచే థియేటర్లలో హంగామా మొదలవుతుంది.
  • పవన్ చేతిలో కటానా వచ్చేసరికి థియేటర్‌లో కేకలు వినిపించక తప్పదు.
  • ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్‌లోకి విలన్‌గా స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు.
  • తమన్ బీజీఎం, రవి చంద్రన్ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత హై లెవెల్ అందించాయి.

మైనస్ పాయింట్లు.. 

  • కథలో పెద్దగా కొత్తదనం లేదు. చాలా సీన్లు ఊహించగలిగేలా ఉంటాయి.
  • ఇంటర్వెల్ తర్వాత పేసింగ్ కొంచెం తగ్గుతుంది, ఎమోషనల్ కనెక్ట్ తక్కువగా ఉంటుంది.
  • ప్రియాంకా మోహన్, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి పాత్రలు అనుకున్నంతగా పండలేదు.
  • OG vs Omi భౌ మధ్య క్లైమాక్స్‌కి ఇంకాస్త పవర్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

Also Read: పవన్ ఫ్యాన్స్ కి షాక్.. 'OG' HD ప్రింట్ లీక్?

టెక్నికల్.. 

దర్శకుడు సుజీత్ ఒక పవర్ స్టార్ అభిమానిగా పవన్ ను ఎలా చూపించాలి అనుకున్నాడో అలాగే అద్భుతంగా చూపించాడు.

తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా పెద్ద బలంగా నిలిచింది.

విజువల్స్‌ రిచ్‌గా చూపించిన సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ.

ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్‌లో షార్ప్ గా ఉంటుంది కానీ, సెకండ్ హాఫ్‌లో కొన్ని కట్స్ అవసరం అనిపిస్తుంది. 

ఫైనల్ గా, OG సినిమా పవన్ అభిమానుల కోసం ఒక స్పెషల్ ట్రీట్ అని చెప్పొచ్చు. కథలో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ, పవన్ స్వాగ్, స్టైల్, యాక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమా నడిపించారు. ఫ్యాన్స్‌కి పక్కా ఎంటర్టైన్మెంట్, మరొకసారి పవన్ వన్ మ్యాన్ షో లాగా హైలైట్ అయ్యాడు. కథ ఇంకాస్త బలంగా ఉండి ఉంటే ఇంకా బాగుండేది. ఈ దసరాకి హ్యాపీగా OG సినిమాని చూసేయొచ్చు. 

Advertisment
తాజా కథనాలు