/rtv/media/media_files/2025/09/25/og-fans-at-theaters-2025-09-25-12-00-12.jpg)
OG fans at theaters
OG MOVIE: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు అభిమానులను 'ఓజీ' క్రేజ్ ఊపేస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'అత్తారింటికి దారేది' తర్వాత దాదాపు 12 ఏళ్లకు మళ్ళీ 'ఓజీ' తో ఆ రేంజ్ హిట్ కొట్టారు పవర్ స్టార్. ప్రీమియర్ షోల నుంచే సినిమా సూపర్ హిట్ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. చాలా కాలం తర్వాత పవర్ స్టార్ అభిమానులకు కిక్కిచ్చే సినిమా వచ్చిందని ఆనందంలో తేలిపోతున్నారు. నిమా చూస్తున్నంత సేపు థియేటర్లలో అరుపులు, కేకలతో రచ్చ రచ్చ చేస్తున్నారు.
కత్తితో స్క్రీన్ చింపేసిన అభిమాని..
బెంగళూరులోని కెఆర్ పురం వెంకటేశ్వర థియోటర్లో అభిమానులు కత్తులతో హంగామా చేశారు. ప్రీమియర్ షో చూస్తూ స్క్రీన్ ముందు కత్తులతో విన్యాసాలు చేస్తూ రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలో కత్తి స్క్రీన్ తగలడంతో స్క్రీన్ చిరిగిపోయింది. దీంతో వెంటనే సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. స్క్రీన్ మార్చాలంటే దాదాపు రూ. 20 లక్షలు ఖర్చు అవుతుందని సమాచారం. అభిమానుల ఓవరాక్షన్ కారణంగా థియేటర్ యాజమాన్యం తీవ్ర ఇబ్బందులు పడిందని నెటిజన్లు మండిపడుతున్నారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నిందిస్తులు పరారీలో ఉన్నట్లు సమాచారం.
‘ఓజీ' సినిమా ప్రీమియర్ షోలో కత్తితో స్క్రీన్ చింపేసిన ఫ్యాన్స్..
— RTV (@RTVnewsnetwork) September 25, 2025
బెంగళూరులోని కేఆర్ పురంలో జరిగిన ఘటన..
దీంతో సీరియస్ అయిన యాజమాన్యం షో నిలిపివేశారు.. #Bangalore#OG#Pawanakalyan#Theatre#Screen#Fans#RTVpic.twitter.com/QQnmqZpZLs
పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గ్యాంగ్ స్టార్ డ్రామగా సాగే ఈ చిత్రంలో పవన్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టార్ గా కనిపించారు. సినిమాలో పవన్ స్టైలిష్ మేకోవర్, మాస్ అప్పీల్, స్క్రీన్ ప్రజెన్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాయి. స్క్రీన్ పై పవన్ కనిపించినప్పుడు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ అని అంటుకున్నారు ప్రేక్షకులు. కథ రొటీన్ సబ్జెక్ట్ అయినప్పటికీ.. సుజీత్ డిఫెరెంట్ మేకింగ్, ప్రజెంటేషన్ ప్రేక్షకులను థియేటర్లో కూర్చోబెట్టాయి. ఇక సినిమా టెక్నీకల్ అంశాలు ఇంటర్ నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్నాయని విమర్శకులు ప్రశంసిస్తున్నారు.
రన్ రాజారన్, ప్రభాస్ సాహో తరవాత సుజీత్ తెరకెక్కించిన మూడవ చిత్రం ఇది. సాహో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. 'ఓజీ' తో సుజీత్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతలో వేసుకున్నాడు.
so Read: TheyCallHimOG: ఇది ఆరంభం మాత్రమే.. 'ఓజీ' సక్సెస్ వేళ ఫ్యాన్ బాయ్ సుజీత్ పోస్ట్ వైరల్!