OG Movie Piracy: పవన్ ఫ్యాన్స్ కి షాక్.. 'OG' HD ప్రింట్ లీక్?

పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా విడుదలైన వెంటనే పైరసీ బారిన పడింది. టెలిగ్రామ్, పైరసీ వెబ్‌సైట్లలో HD ప్రింట్ లీక్ అయింది. సినిమా బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, పైరసీ కారణంగా నిర్మాతలు కొంత ఆందోళన చెందుతున్నారు.

New Update
OG Movie Piracy

OG Movie Piracy

OG Movie Piracy: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన క్రేజీ మూవీ ‘OG’ చివరకు నేడు థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై ఉన్న అంచనాలను అందుకుందనే టాక్ OG థియేటర్ల వద్ద వినిపిస్తోంది.  ప్రీమియర్ షోల నుంచే మంచి రెస్పాన్స్‌తో బాక్సాఫీస్(OG Box Office Collections) వద్ద దుమ్ము రేపుతోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పవన్ ఫ్యాన్స్ సినిమా చూసి థియేటర్లలో సందడి చేస్తున్నారు. పవన్ స్వాగ, స్టైల్, డైలాగ్స్, ఫైట్స్ అన్నీ అభిమానులకు కిక్కిచ్చేలా ఉన్నాయని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

HD ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్

కానీ, ఇంతలోపే సినిమాకు పెద్ద షాక్ తగిలింది. ఎప్పటిలాగే ఈసారి కూడా పైరసీ మూలంగా నిర్మాతలకు నష్టం వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. OG సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే HD ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్(OG HD Print Leak) అయింది. టెలిగ్రామ్ గ్రూపులు, పలు పాపులర్ పైరసీ వెబ్‌సైట్లలో సినిమా లింకులు చక్కర్లు కొడుతున్నాయి. 

ఇటీవలి కాలంలో సినిమా విడుదల అయిన వెంటనే పైరసీ బారిన పడటం సాధారణమైపోయింది. స్టార్ హీరో సినిమా అయినా, చిన్న హీరో సినిమా అయినా తేడా లేకుండా విడుదలైన రోజే ఫుల్ క్వాలిటీ వీడియోలు ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి. ఇది పరిశ్రమకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది.

 అసలు ‘OG’ పైరసీకు సంబంధించి  సినిమా రిలీజ్ కాకముందే ‘బప్పమ్ టీవీ’ (IBOMMA) అనే వెబ్‌సైట్ ఓ పోస్టర్ షేర్ చేసింది. “OG కమింగ్ సూన్” అంటూ ఆ వెబ్‌సైట్‌లో పెట్టిన పోస్టర్ నెట్టింట వైరల్ అయ్యింది. దీనిపై సినీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అలాంటి హెచ్చరికలు ఇవ్వడమే కాదు, కొన్ని సార్లు థియేటర్స్‌లో ఫస్ట్ షో కూడా పూర్తికాక ముందే సినిమా లీక్ అవుతోంది. అయితే ఆ పోస్టర్ వివాదానికి దారితీయడంతో వెంటనే పోస్టర్ ను తొలగించారు. 

పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా భారీ హిట్ టాక్ అందుకున్నప్పటికీ, పైరసీ రూపంలో కొంత నష్టమే అని చెప్పాలి. సినిమా టీమ్ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. అంతేకాదు, సినీ అభిమానులు కూడా సినిమా థియేటర్లో చూసి అసలైన అనుభూతి పొందాలని, పైరసీని ప్రోత్సహించకుండా పరిశ్రమను సపోర్ట్ చేయాలని కోరుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు