OG Ticket Price: పవన్ కళ్యాణ్ 'OG' క్రేజ్.. ఒక టికెట్‌కు అక్షరాలా 5 లక్షలు!

పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది. నార్త్ అమెరికాలో ఫస్ట్ వీక్ టికెట్ రూ.5 లక్షలకు అమ్ముడవ్వగా. ఇతర ప్రాంతాల్లోనూ భారీ బిడ్లు వచ్చాయి. ఈ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇస్తున్నారు. సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.

New Update
OG Ticket Price

OG Ticket Price

OG Ticket Price: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న "OG – They Call Him OG" సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలు ఇలా అన్నిటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదల కానుండగా, రిలీజ్‌కు ముందే ఓ అభిమాని చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది.

ఒక టికెట్‌కు 5 లక్షలు!

ప్రీమియర్ షో చూసేందుకు ఒకే ఒక్క టికెట్‌ను ఓ పవన్ కళ్యాణ్ అభిమాని ఏకంగా రూ. 5,00,000 కు కొనుగోలు చేశాడు. దింతో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు అందరూ ఆశ్చర్యపోతున్నారు. పవన్ ఫ్యాన్స్ అయితే ఈ న్యూస్ ని ఫుల్ వైరల్ చేస్తూ గర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ బిడ్డింగ్ నార్త్ అమెరికాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇది ఒక రికార్డు ధర మాత్రమే కాదు, పవన్ అభిమానుల ప్రేమ ఏ రేంజ్ లో ఉంటుందో తెలపడానికి ఒక ఉదాహరణ!!

Also Read:రామ్ చరణ్ “పెద్ధి” ఇంట్రెస్టింగ్ అప్డేట్: అమ్మగా ‘అఖండ’ నటి!

హైదరాబాద్ కుకట్‌పల్లి విశ్వనాధ్ థియేటర్ లో ఫస్ట్ టికెట్ రూ. 1,12,000 కు అమ్ముడైందట. మిగతా టికెట్లు రూ. 23,111, రూ. 18,100 ధరలకు అమ్ముడయ్యాయి.

చెన్నై: మొదటి టికెట్ రూ. 1,00,000 బిడ్డింగ్‌కి వెళ్లింది. మిగిలిన టికెట్లు రూ. 47,000, రూ. 25,000 ధరలకు అమ్ముడయ్యాయి.

ఈ మొత్తం డబ్బు జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నట్టు ఫ్యాన్స్ ప్రకటించారు. 

విదేశాల్లో OG జోరు

OG సినిమాపై ఇండియాలో మాత్రమే కాదు, విదేశాల్లోనూ భారీ స్పందన వస్తోంది. మెల్‌బోర్న్ IMAX థియేటర్‌లో టికెట్లు కొన్ని నిమిషాల్లోనే సాల్డ్ అవుట్ కావడంతో, థియేటర్ యాజమాన్యం అదనపు షోలను ప్లాన్ చేసింది. ఓ తెలుగు సినిమా కోసం విదేశాల్లో ఇలా టికెట్లు వేగంగా అమ్ముడుపోవడం చాలా అరుదు.

Also Read: సుధీర్ బాబు 'జటాధర' వచ్చేదప్పుడే ..!

అయితే, ఈ సినిమాను డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తుండగా, డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. హీరోయిన్ గా ప్రియాంకా మోహన్ నటిస్తున్నారు. విలన్ పాత్రలో ఐమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. సంగీతం థమన్ ఎస్ ఎస్ అందిస్తున్నారు.

Also Read: వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?

ఈ మాస్ యాక్షన్ డ్రామాలో పవన్ కళ్యాణ్ ఓ కిల్లర్ లుక్స్ లో  కనిపించనున్నాడు. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో పవన్ మాస్ స్టామినాను మరోసారి తెరపై చూపించబోతున్నారు. మొత్తానికి 'OG' సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో బిగ్ బ్లాస్టర్ అవ్వబోతుందని క్రేజ్ చూస్తే అర్థమవుతోంది.

Advertisment
తాజా కథనాలు