/rtv/media/media_files/2025/09/19/og-america-bookings-2025-09-19-10-56-06.jpg)
OG America Bookings
OG America Bookings: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న ‘OG (They Call Him OG)’ సినిమా విడుదలకు ముహూర్తం దగ్గరపడుతుండటంతో, ఫ్యాన్స్ ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి మారిపోయారు. యాక్షన్, గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై విడుదలకు ముందే విపరీతమైన హైప్ క్రియేట్ అయింది.
#OG North America Premiere Advance Sales :
— L O G A N (@KamleshCha74151) September 19, 2025
USA 🇺🇸 : $1.66M
Canada 🇨🇦 : $170k
Total : $1.83M 🔥🔥
6 Days Till Premiere#PawanKalyan#EmraanHashmipic.twitter.com/CBus1tq4rz
Also Read: 'OG' సునామీ షురూ.. బుకింగ్స్ ఓపెన్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?
సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్
దర్శకుడు సుజీత్(Director Sujeeth) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. తమన్(Thaman OG) సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25, 2025న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. పవన్ కల్యాణ్ సరసన ప్రియాంకా అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తోంది.
నార్త్ అమెరికాలో రికార్డు స్థాయిలో బుకింగ్స్
ఇప్పటికే నార్త్ అమెరికాలో ఈ సినిమాపై అంచనాలు అసాధారణంగా ఉన్నాయి. ట్రైలర్ ఇంకా రిలీజ్ కాకముందే, అక్కడ $1.75 మిలియన్ ప్రీ-సేల్స్ నమోదవడం విశేషం. ఇందులో సినిమార్క్ (Cinemark) థియేటర్ చైన్‌లో ఒక్కదానిలోనే $1 మిలియన్ విలువైన టికెట్లు అమ్ముడయ్యాయి. ఇది పవన్ కల్యాణ్ క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.
Also Read: 'కల్కి 2' నుండి దీపికను తీసేసారు సరే.. మరి బిడ్డను కనేదెవరు..?
ట్రైలర్ రావాల్సి ఉంది! (OG Trailer)
ఈ రోజు వరకూ ట్రైలర్ రిలీజ్ కాలేదు కానీ, సెప్టెంబర్ 21 ఉదయం 10:08AMకి అఫిషియల్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్ రావకముందే ఈ స్థాయిలో హైప్ ఉండటం, OG సినిమాపై అభిమానుల ప్రేమను చెప్పకనే చెబుతుంది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో కనిపించనుండగా, ఇమ్రాన్ హష్మి, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శామ్, శ్రియా రెడ్డి వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రతీ పాత్రకు ఓ వెయిట్ ఉంటుందని, విడుదల చేస్తున్న క్యారెక్టర్ పోస్టర్స్‌తో అర్థమవుతోంది.
Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద మాఫియా.. అల్లు అరవింద్ క్రెడిట్స్ కొట్టేస్తాడు: బండ్ల గణేష్
ఇప్పటికే అర్జున్ దాస్ లుక్ విడుదల కాగా, తాజాగా ప్రకాశ్ రాజ్ పాత్ర ‘సత్య దాదా’ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముందు ముందు మరిన్ని క్యారెక్టర్ పోస్టర్స్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఫ్యాన్స్‌కి ట్రీట్‌లే ట్రీట్ లు..
OG టీమ్ వరుసగా చిన్న చిన్న అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. ట్రైలర్, సాంగ్స్, క్యారెక్టర్ లుక్స్ ఇలా అన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ హైప్ మరింత పెరగనుంది.
ఇలా చూసుకుంటే, ‘OG’ చిత్రం విడుదలకు ముందే అమెరికాలో భారీ స్థాయిలో కలెక్షన్లు నమోదు చేస్తోంది. ట్రైలర్ రావాల్సి ఉండగా, ఈ స్థాయిలో బుకింగ్స్ ఉండటం నిజంగా అరుదైన విషయం. సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానున్న OG, ఈ సంవత్సరం అత్యంత భారీగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి ఇది నిజమైన ఫెస్టివల్ లాంటి సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ మూవీ రిలీజ్ తర్వాత ఇంకెన్ని సెన్సషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి