Robo Shankar: షాకింగ్.. అనారోగ్యంతో టాప్ కమెడియన్ కన్నుమూత..

ప్రముఖ హాస్యనటుడు రోబో శంకర్ (46) అనారోగ్యంతో సెప్టెంబర్ 18న చెన్నైలో కన్నుమూశారు. "మారి", "విశ్వాసం" వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన ఆయన మృతిపై సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపారు. ఆయనకు ఓ కుమార్తె ఉన్నారు.

New Update
Robo Shankar

Robo Shankar

Robo Shankar: తమిళ సినిమా రంగంలో అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హాస్యనటుడు రోబో శంకర్ ఇకలేరన్న వార్త సినీ ప్రపంచాన్ని కలిచివేసింది. ఆయన సెప్టెంబర్ 18న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఇటీవల ఆరోగ్యం మరింత దిగజారడంతో కన్నుమూశారు. ఆయన వయసు కేవలం 46 సంవత్సరాలు మాత్రమే.

Also Read: 'ము.. ము.. ముద్దంటే చేదా..?’ ఇంట్రెస్టింగ్ గా 'కిస్' ట్రైలర్..

అనారోగ్యం కారణంగా.. (Robo Shankar Passes Away)

కిడ్నీల సమస్యతో బాధపడుతున్న రోబో శంకర్, ఇటీవల ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి పడిపోయారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందించారు. అయినప్పటికీ ఆరోగ్యం మెరుగు పడక మృతి చెందారు.

ఈ సినిమాల ద్వారా గుర్తింపు

రోబో శంకర్ తన కెరీర్‌ను "హే", "దీపావళి" సినిమాలతో ప్రారంభించారు. అయితే, ఆయనకు అసలైన గుర్తింపు ధనుష్ హీరోగా నటించిన "మారి" సినిమాతో వచ్చింది. ఈ చిత్రంలో ఆయన చేసిన పాత్రకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఆయన కామెడీ టైమింగ్‌, బాడీ లాంగ్వేజ్ తో ఆయన చేసే నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Also Read: Shanmukh Jaswanth: 'ప్రేమకు నమస్కారం' అంటున్న షణ్ముఖ్.. కొత్త సినిమా గ్లింప్స్ అదిరింది బ్రో !

అంతేకాదు, అజిత్‌తో చేసిన "విశ్వాసం", శివకార్తికేయన్‌తో "వేలైక్కారన్", అలాగే "సింగం 3", "పులి", "కోబ్రా", "అభిమన్యుడు" వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో రోబో శంకర్ తన ప్రతిభను చూపించారు.

తెలుగు ప్రేక్షకులకు పరిచయం

తమిళ సినిమాలతో పాటు, ఆయన నటించిన చాలా చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. "మారి", "పులి", "సింగం 3", "నానుమ్ రౌడీ థాన్", "అభిమన్యుడు", "కోబ్రా" లాంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి గుర్తింపు పొందారు. కామెడీ పాత్రలతో పాటు ఆయన యాక్షన్, ఎమోషన్ కలగలిపిన నటన కూడా ప్రేక్షకులను మెప్పించారు.

Also Read: డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. 'ఫౌజీ' లో మరో స్టార్ హీరో ఎంట్రీ!

రోబో శంకర్ భార్య పేరు ప్రియాంక శంకర్, కూతురు ఇంద్రజ. ఆమె కూడా నటిగా కొనసాగుతోంది. విజయ్ నటించిన "విజిల్" సినిమాలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా నటించగా, "పాగల్" సినిమాలో విశ్వక్ సేన్ తో కలిసి నటించారు.

Also Read: దుమ్మురేపుతున్న 'OG' సెన్సార్ టాక్.. ఊచకోతేనట..!

సినీ ప్రముఖుల సంతాపం

రోబో శంకర్ మృతి పట్ల పలు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కమల్ హాసన్ భావోద్వేగంతో స్పందించారు. “రోబో శంకర్ అనేది ఒక పేరు మాత్రమే, నా దృష్టిలో నువ్వు నా తమ్ముడివి. నన్ను వదిలి ఎలా వెళ్తావు? నీ పని పూర్తయింది.. నీవు వెళ్లిపోయావు. కానీ నా పని ఇంకా మిగిలే ఉంది” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

అలాగే రాఘవ లారెన్స్, విష్ణు విశాల్, సిమ్రాన్, వరలక్ష్మి శరత్ కుమార్, దర్శకుడు వెంకట్ ప్రభు తదితరులు కూడా సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలియజేశారు.

రోబో శంకర్ మృతదేహాన్ని చెన్నైలోని వలసరవక్కంలో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చిన్న వయసులోనే ఎంతో ప్రతిభను చూపిన నటుడు మనల్ని విడిచిపెట్టిన ఈ విషాద వార్త సినీ ప్రేక్షకులను, అభిమానులను తీవ్రంగా కలచివేసింది. 

Advertisment
తాజా కథనాలు