/rtv/media/media_files/2025/09/18/og-trailer-2025-09-18-10-59-10.jpg)
OG Trailer
OG Trailer: టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా వస్తున్న ‘ఓజీ’ (OG). ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై భారీ అంచనాలు ఏర్పరిచాయి. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సెప్టెంబర్ 25, 2025 న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
ట్రైలర్ కోసం ఎదురుచూపులు..
సినిమా విడుదలకు వారం మాత్రమే మిగిలి ఉండడంతో, పవన్ అభిమానులు ఇప్పుడు ఒక్కటే కోరుతున్నారు - 'ఓజీ' థియేట్రికల్ ట్రైలర్. సినిమా టీజర్ వదిలినప్పటి నుంచి అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటివరకు ట్రైలర్ విడుదల కాకపోవడంతో అభిమానులు సోషల్ మీడియాలో "OG Trailer Please" అంటూ డిమాండ్ చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ డేట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Also Read: Sootravakyam: ఓటీటీలో రికార్డులు దుల్లగొడుతున్న మలయాళ మూవీ.. ఆలస్యమెందుకు ఈ థ్రిల్లర్ మూవీ చూసేయండి!
పవన్ కళ్యాణ్ మాస్ లుక్స్..
ఈ సినిమాలో పవన్ ఒక కొత్త గ్యాంగ్‌స్టర్ లుక్‌తో కనిపించనున్నారని చిత్ర బృందం ఇప్పటికే చెప్పింది. పవన్ ఎనర్జీ, స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి. అభిమానులు కూడా ఇదే ఆశతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచుకున్నారు.
Also Read: డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. 'ఫౌజీ' లో మరో స్టార్ హీరో ఎంట్రీ!
ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇది ఆయనకు మొదటి తెలుగు సినీ రంగ ప్రవేశం కూడా. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీ పవన్‌కు కరెక్ట్ విలన్‌గా కనిపిస్తారని మేకర్స్ చెబుతున్నారు.
భారీ బడ్జెట్..
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సినిమా టెక్నికల్ గా అత్యుత్తమంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా లో విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ టాప్ క్లాస్‌గా ఉండబోతున్నాయని సమాచారం. పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
1AM బెనిఫిట్ షో..
సెప్టెంబర్ 25న ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి 1AM బెనిఫిట్ షోలు నిర్వహించనున్నారు. వీటి టికెట్ ధరను ప్రభుత్వం రూ.1000గా నిర్ణయించింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘ఓజీ’ సినిమా, మాస్ & క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కుతోంది. ట్రైలర్ త్వరలోనే విడుదల కానుండగా, మూవీ రిలీజ్ డేట్‌కు కౌంట్‌డౌన్ మొదలైపోయింది. ఈ సినిమాతో పవన్ మరోసారి తన పవర్ చూపించనున్నాడు.