Fish Venkat: పవన్‌కు పాదాభివందనం.. నటుడు ఫిష్ వెంకట్ వీడియో వైరల్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంచి మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు ఫిష్ వెంకట్‌కు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫిష్ వెంకట్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. పవన్‌కు పాదాభివందనం అని తెలిపాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది.

New Update
Artist Fish Venkat

Artist Fish Venkat

ఫిష్ వెంకట్.. ఈ పేరు అందరికీ తెలియకపోవచ్చు. కానీ మనిషిని చూస్తే మాత్రం ఒక్క సెకన్‌లో గుర్తుపట్టేస్తారు. సినిమాలలో అతడు 100కి పైగా సినిమాలు చేశాడు. తన కామెడీతో ఎంతో మందిని కడుపుబ్బా నవ్వించాడు. చిన్న చిన్న హీరోల నుంచి బడా హీరోల వరకు అందరి సినిమాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. 

అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి అంతగా ఏం బాగాలేదు. పలు అనారోగ్య సమస్యల కారణంగా ఇంటికే పరిమితమయ్యాడు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్‌ తనను ఎంతగానో ఆదుకున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. పవన్ చేసిన సాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేనని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశాడు. 

‘‘నేను మీ ఫిష్ వెంకట్. ఈ రోజు నా పరిస్థితి బాగాలేదు. షుగర్, బీపీతో చాలా క్రిటికల్‌గా ఉంది నా పరిస్థితి. కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి. ప్రస్తుతం డయాలసిస్ జరుగుతోంది. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుండటంతో మా ఇంట్లో వారు, ముఖ్యంగా నా భార్య.. పవన్ కళ్యాణ్‌ సర్‌ని కలవమని చెప్పింది.

ఇది కూడా చూడండి: గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లో వీడియోలు.. విద్యార్థినుల ఆందోళన

దీంతో పవన్ సర్ దగ్గరకు వెళ్లి కలిసారు. ఆయన వెంటనే స్పందించారు. తన తరపు నుంచి చేయాల్సిందల్లా చేస్తాను. కిడ్నీ ప్రాబ్లమ్ మొత్తం క్లియర్ చేయ్యిస్తా అని చెప్పి రూ.2 లక్షల ఆర్థికంగా సహాయం చేశారు. ఆయనకు పాదాభివందనాలు. ఆయన కుటుంబ సభ్యులు శుభసంతోషాలతో ఉండాలి. థాంక్యూ పవన్ సర్. మీరు చాలా హెల్ప్ చేశారు. 

ఇది కూడా చూడండి: ప్రయాణికులకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన ఎయిర్‌ ఇండియా..

నా జీవితంలో ఫస్ట్ టైం

నా జీవిత కాలంలో మీ హెల్ప్ మరిచిపోలేను. నా కన్న తల్లిదండ్రులు ఎంతనో.. మీరు కూడా అంతే సర్. నా జీవితంలో ఫస్ట్ టైం.. రూ2 లక్షలు ఇచ్చి ఆదుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. మీరెప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో చూసి మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ముందుంటారని కామెంట్లు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. అర్హత, చివరి తేదీ వివరాలివే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు