/rtv/media/media_files/2025/09/23/pawan-kalyan-2025-09-23-15-51-26.jpg)
Pawan Kalyan
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ ట్రైలర్(OG Trailer) విడుదలైన క్షణం నుంచే ఫ్యాన్స్ లో ఉత్సాహం తారస్థాయికి చేరింది. పవన్ మాస్ డైలాగ్స్, స్టైల్, యాక్షన్ సీన్స్ చూస్తుంటే అసలైన "వింటేజ్ పవన్" మళ్లీ వచ్చేశాడనే ఫీల్ ఫ్యాన్స్‌కి కలుగుతోంది. ట్రైలర్ విడుదలైన కొద్ది సేపట్లోనే లక్షల వ్యూస్ తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Also Read: 'ఓజీ' షో క్యాన్సిల్.. పవన్ ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్!
చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఫుల్ మాస్ యాక్షన్ రోల్‌లో కనిపించబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ముంబై గ్యాంగ్‌స్టర్ బేస్డ్ స్టోరీ ఉన్న ఈ సినిమాలో పవన్ ఓజస్ గంభీర్ అనే పవర్ ఫుల్ పాత్రలో అలరించనున్నాడు. ఈ మూవీలో ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని తమన్ అందించగా, డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కాబోతుంది.
ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పవన్ హంగామా.. (OG Pre Release Event)
ఈ మూవీకి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో అత్యంత గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కనిపించిన విధానం, ఆయన స్టేజిపై చూపించిన కొన్ని విన్యాసాలు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడిగా కత్తి పట్టుకుని స్టేజీపై తిరుగుతూ, పబ్లిక్‌లో చేయడం తగదు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
#pawankalyan entrance at #OG prerelease event #TheyCallHimOG#Janasena#Sujith#OGTrailerpic.twitter.com/l7ax5h9uVJ
— Today Talkies (@TodayTalkies) September 21, 2025
పవన్ ధరించిన బంగారు జంధ్యం వైరల్
ఈ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ధరించిన జంధ్యం ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. బ్లాక్ షర్టులో వచ్చిన ఆయన ట్రాన్స్పరెంట్ షర్ట్ వలన ఆయన వేసుకున్న జంధ్యం స్పష్టంగా కనిపించింది. ఆశ్చర్యం ఏంటంటే, పవన్ వేసుకున్న జంధ్యం బంగారంతో తయారైందని కొన్ని ఫోటోలు చూస్తే తెలుస్తోంది. ఇది అభిమానులకే కాదు, సామాన్యులకూ షాక్ కలిగించింది.
అప్పటి నుండి విమర్శలు మొదలయ్యాయి. "ప్రజల కోసమే సినిమాలు చేస్తున్నానని చెప్పే పవన్ ఇప్పుడు బంగారు జంధ్యం వేసుకుంటున్నారా?" అంటూ యాంటీ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. “తన దగ్గర డబ్బులే లేవని, ప్రజలే తన బలం అంటూ ప్రచారం చేసుకునే ఆయన ఇలా జంధ్యం కూడా బంగారమే ధరిస్తే ఎలా?” అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Also Read: 'OG' రిలీజ్ పోస్ట్ పోన్..? అసలు ఎందుకింత గందరగోళం..!
ఓవైపు ట్రైలర్ హైప్‌తో అభిమానులు ఫుల్ జోష్ లో ఉంటె, మరోవైపు ఈవెంట్‌లో పవన్ లుక్, బంగారు జంధ్యం కొత్త దుమారం రేపుతున్నాయి. సినిమాకు అద్భుతమైన ప్రచారం జరుగుతున్నా, వ్యక్తిగత వ్యాఖ్యలతో ఆయనపై విమర్శలు పెరుగుతుండటం గమనార్హం. అయితే పవన్ కళ్యాణ్ అభిమానుల మాత్రం ఇవేవి పట్టించుకోవడం లేదు. OG పవర్‌ఫుల్ హిట్ కాబోతోంది అనే నమ్మకంతో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్.