OG First Single: పవర్ స్టార్ 'ఫైర్ స్ట్రామ్'.. OG ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోందోచ్!

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ షూటింగ్ మళ్లీ ప్రారంభమవుతోంది. అయితే ఫస్ట్ సింగిల్ ఆగస్టు 2న విడుదల కానుందని మూవీ యూనిట్ పోస్టర్ ద్వారా తాజాగా ప్రకటించింది.

New Update
OG First Single

OG First Single

OG First Single:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఓజీ’ (OG) పైన అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతోంది. మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

ఈ మూవీలో పవన్ సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా కనిపించనుండగా, విలన్ పాత్రల్లో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లోనే కాదు, టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే చాలా శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ, పవన్ కళ్యాణ్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొంతకాలంగా షూటింగ్‌కు విరామం వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం, OG షూటింగ్ మళ్లీ ప్రారంభం అవ్వనుందని సమాచారం. అయితే తాజాగా ‘ఓజీ’ టీమ్ నుంచి ఒక మంచి  అప్డేట్ వస్తుందని ఎదురు చూస్తున్న అభిమానులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది.

అగ్ని తుఫాన్ రాబోతుంది..

మూవీ యూనిట్ స్పెషల్ పోస్టర్ విడుదల చేస్తూ, ఫస్ట్ సింగిల్ ఆగస్టు 2న విడుదల కానుందని తెలిపారు. ఈ పోస్టర్‌లో ఓ ఆడియో క్యాసెట్ పై “Born in rage, Built for the fight, He’s back to write the final page. Firing 🔥G moment". అగ్ని తుఫాన్ రాబోతుంది సిద్ధంగా ఉండండి” అనే  క్యాప్షన్ తో డైరెక్టర్ సుజీత్ ఇంస్టా లో పోస్ట్ చేశారు.

ఈ పోస్టర్‌లో కనిపించిన ఎరుపు రంగు పాము, క్యాసెట్ డిజైన్ అన్ని ఫ్యాన్స్ లో మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇది చూసిన పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ పోస్టర్‌ను వైరల్ చేస్తూ, సినిమాలోని యాక్షన్ యాంగిల్‌ పై చర్చలు మొదలుపెట్టారు.

ఈ సింగిల్ తో పాటు తర్వాతి ప్రోమోస్‌కి, టీజర్‌కి ఫుల్ స్వింగ్ లో మూవీ టీమ్ రెడీ అవుతున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ సరికొత్త లుక్‌, పవర్‌ఫుల్ డైలాగ్స్, మాస్ యాక్షన్ సీన్స్ ఈ సినిమా హైలైట్స్ కానున్నాయని తెలుస్తోంది..

‘ఓజీ’ నుంచి ఇలా ఓసారి ప్రమోషన్ స్టార్ట్ అయినదంటే… సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరడం పక్కా. అభిమానుల ఆశలను నిలబెట్టేలా ఈ సినిమా ఉంటుందాని మూవీ టీమ్  ఇక\ప్పటికే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సాంగ్స్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ అన్ని త్వరలోనే ఒక్కోటిగా రానున్నాయి.


OG ఫస్ట్ సింగిల్: ఆగస్టు 2

నటీనటులు: పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుళ్ మోహన్, ఇమ్రాన్ హష్మీ

డైరెక్టర్: సుజీత్ | నిర్మాత: డీవీవీ దానయ్య

Advertisment
తాజా కథనాలు