Coolie Censor: 'A' ‌రేటింగ్‌తో కు..కు..కు.. కూలీ పవర్ హౌసే... ఆగస్ట్ 14 అస్సలు తగ్గేదేలే!

రజినీకాంత్, లోకేశ్ కనకరాజ్ కాంబోలో రూపొందిన ‘కూలీ’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెరికాలో తెలుగు వెర్షన్‌కి ఇప్పటికే $100k పైగా ప్రీ-సేల్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకు తాజాగా సెన్సార్ బోర్డు ‘A’ రేటింగ్ ఇచ్చింది.

New Update
Coolie Censor

Coolie Censor

Coolie Censor: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’, దర్శకుడు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై క్రేజ్ రోజో రోజుకి పెరుగుతోంది. రజినీకాంత్ ఎప్పటిలానే, ఈ సారి కూడా కూలీ మూవీతో మరోసారి బాక్సాఫీస్‌ని షేక్ చేయనున్నాడు.

ఇప్పటికే అమెరికాలో తెలుగు వెర్షన్‌కి సాలిడ్ ప్రీ-రిలీజ్ సేల్ జరిగింది. కేవలం తెలుగు వెర్షన్ ద్వారానే 100,000 డాలర్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్టు సమాచారం. కెనడాలో కూడా సినిమా క్రేజ్ పెరుగుతోంది. రజినీకాంత్ సినిమాలకు సాధారణంగా కనిపించే క్రేజ్ కంటే కూలీ సినిమాకి ఎక్కువ క్రేజ్ ఉన్నట్టుగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read:'కూలీ' లెక్కలు మారాయి! నెక్స్ట్ లెవల్ క్రేజ్ ఇది..

సెన్సార్ బోర్డు షాకింగ్ ‘A’ రేటింగ్.. (Coolie Censored A)

త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి ఈ సినిమాకి ‘A’(Coolie Censored A) (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికెట్ రావడం సినీ వర్గాల్లో ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో తొలిసారి ‘A’ రేటింగ్ పొందిన సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో వయోలెన్స్ ఎక్కువగా ఉందా? లేక వేరే కారణాలున్నాయా తెలియలేదు. అయితే ఈ మూవీ కి A సర్టిఫికెట్ రావడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.  

Also Read: కోట్లు కొల్లగొడుతున్న 'కూలీ'.. ఇది కదా రజిని రేంజ్..!

భారీ బడ్జెట్

ఈ చిత్రంలో రజినీకాంత్‌కు తోడు బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, అలాగే శృతి హాసన్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ విభిన్న భాషల ఇండస్ట్రీల నుండి వస్తున్న ఈ స్టార్ కాస్ట తో సినిమాని మరింత స్పెషల్ కానుంది. ఆగస్ట్ 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది.

నెక్స్ట్ జైలర్ 2.. 

ఇంకో ఆసక్తికర వార్త ఏమిటంటే, రజినీకాంత్ తన గత సినిమా ‘జైలర్’ (2023) తర్వాత ఇప్పుడు 'జైలర్ 2'ని కూడా స్టార్ట్ చేశారు. ‘కూలీ’ సినిమా విడుదల తరువాత జైలర్ 2 పై అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది.

‘కూలీ’ సినిమా విడుదలకు దగ్గరవుతున్న కొద్దీ, ఫ్యాన్స్ లో ఆసక్తి  మరింతగా పెరుగుతోంది. అనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం, లోకేశ్ బ్రాండ్ ఆఫ్ మాస్ యాక్షన్‌తో ప్రేక్షకులకు ఊహించని అనుభూతిని ఇస్తుందని గట్టి నమ్మకం ఉంది. ఇప్పటికే ప్రమోషన్లు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుండగా, విడుదల తర్వాత సినిమా ఏ రేంజ్ హిట్ అవుతోందో చూడాలి.

Advertisment
తాజా కథనాలు