/rtv/media/media_files/2025/09/20/og-vs-kalki-2-2025-09-20-09-54-46.jpg)
OG vs Kalki 2898 AD
OG vs Kalki: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ డ్రామా OG (They Call Him OG) సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌కు సంబంధించి అభిమానుల్లో ఇప్పుడే భారీ ఎగ్జైట్ కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, సాంగ్స్, పోస్టర్లు అన్ని మాస్‌కి ఫుల్‌గా కనెక్ట్ అయ్యాయి.
Also Read: 'OG' సునామీ షురూ.. బుకింగ్స్ ఓపెన్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?
ఇక OG చిత్రానికి యాక్షన్‌తో పాటు స్టైల్‌ను కలిపి ఓక్ సూపర్ గ్యాంగ్‌స్టర్ బేస్డ్ కథగా తెరకెక్కించినట్టు టీజర్స్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా తెలుగు సినిమాల్లో ఆయనకి ఇది తొలి ఎంట్రీ కావడం విశేషం. ఇక ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే ప్రేక్షకుల నుండి మంచి మార్కులు కొట్టేసింది.
Also Read: 'కల్కి 2' నుండి దీపికను తీసేసారు సరే.. మరి బిడ్డను కనేదెవరు..?
ఈ సినిమా పైన విదేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్ నెలకొంది. నార్త్ అమెరికా ప్రీమియర్స్‌కు ఇప్పటికే $2 మిలియన్‌కు దగ్గరగా అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చాయి. ట్రైలర్ రిలీజ్ కాకముందే ఈ రికార్డు నమోదవ్వడం విశేషం. అయితే ఇక్కడే చిన్న సమస్య ఉంది. AMC థియేటర్ చైన్ లో ఇంకా బుకింగ్స్ ప్రారంభం కాలేదు. ట్రైలర్ కాన్టెంట్ అందిన తర్వాతే అక్కడ బుకింగ్స్ మొదలవుతాయని సమాచారం.
Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద మాఫియా.. అల్లు అరవింద్ క్రెడిట్స్ కొట్టేస్తాడు: బండ్ల గణేష్
హయ్యెస్ట్ ప్రీమియర్ రికార్డు ప్రభాస్(Prabhas) ‘కల్కి 2898 AD’ పేరిట
ఈ డిలే కారణంగా OG, ప్రస్తుత తెలుగు సినీ రికార్డును దాటుతుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి నార్త్ అమెరికాలో హయ్యెస్ట్ ప్రీమియర్ రికార్డు ప్రభాస్(Prabhas) ‘కల్కి 2898 AD’ పేరిట ఉంది. OG ఆ రేంజ్‌కి వెళ్లాలంటే, AMC లాంటి మల్టీ ప్లెక్సుల్లోనూ ఫుల్ బుకింగ్స్ కావాలి. బుకింగ్స్ సోమవారం లేదా మంగళవారం ప్రారంభమయ్యే అవకాశముంది.
ఇక ప్రమోషన్ విషయానికి వస్తే, మేకర్స్ ఇప్పటికే స్పీడ్ పెంచారు. సెప్టెంబర్ 21న హైదరాబాదులో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ OG సినిమా హైప్‌ను మరింతగా పెంచనుంది.
మొత్తానికి, OG సినిమా అన్ని భాషల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంటోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, జనరల్ ఆడియెన్స్‌లోనూ ఈ సినిమాపై ఆసక్తి కనిపిస్తోంది. మరి ఈ సినిమా ఓపెనింగ్స్‌తో కొత్త రికార్డులు సెట్ చేస్తుందా? అన్నది చూడాలి.