NTRNEEL: 'NTR31' లో ఇద్దరు బిగ్ స్టార్స్.. ఏం ప్లాన్ చేశావ్ నీల్ మావా?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. మలయాళ యంగ్ హీరో టోవినో థామస్, ప్రముఖ నటుడు బిజూ మీనన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారట. ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్టీఆర్ షూట్‌లో జాయిన్ కానున్నట్లు సమాచారం.

New Update
NTR PRASANTH NEEL Movie

NTR PRASANTH NEEL

'దేవర' పాన్ ఇండియా సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి 'వార్ 2' సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. కేజీఎఫ్, సలార్ సినిమాలతో సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 31 వ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

Also Read : 'గేమ్ ఛేంజర్' ఈవెంట్ లో ఇద్దరు మృతి.. అండగా నిలిచిన పవన్, దిల్ రాజు

రీసెంట్ గానే  పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీమీ సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ కు 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. జనవరి మూడో వారంలో మంగళూరులో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమవుతుందని, ఎన్టీఆర్ ఫిబ్రవరి మొదటి వారం షూట్‌లో జాయిన్ కానున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. తాజా అప్డేట్ ప్రకారం, మలయాళ యంగ్ హీరో టోవినో థామస్, ప్రముఖ నటుడు బిజూ మీనన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారట. ఇప్పటికే ప్రశాంత్ నీల్ వాళ్లకు స్టోరీ వినిపించగా.. కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 

Also Read :  మాట్లాడలేని పరిస్థితుల్లో హీరో విశాల్‌..అసలేమైందంటే!

త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. మరోవైపు ఎన్టీఆర్ -నీల్ కి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో కర్ణాటక అడవుల్లో వాళ్లిద్దరూ చిల్ అవుతున్నట్లు  కనిపించడంతో ఫ్యాన్స్ ఈ ఫొటోను నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.

Advertisment