#NTRNeel విడుదలకు ముహూర్తం ఫిక్స్... ఆరోజే థియేటర్స్ లో సందడి

ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ సినిమాపై మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. #NTRNeel వచ్చే ఏడాది 2026 జూన్ 25న విడుదల కానున్నట్లు తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా మూవీ గ్లిమ్ప్స్ రానుంది.

New Update
#NTRNeel release date announced

#NTRNeel release date announced

NTRNeel  ఎన్టీఆర్- డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న  మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ #NTRNeel. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్ లో రోజురోజుకు క్యూరియాసిటీ పెరిగిపోతుంది.  ఈ క్రమంలో తాజాగా సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 

NTRNeel రిలీజ్ డేట్

NTRNeel వచ్చే ఏడాది 2026 జూన్ 25న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్  పుట్టినరోజున సందర్భంగా మూవీ గ్లిమ్ప్స్ వీడియో విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 

Also Read: 70 ఏళ్ల అమ్మమ్మ చీరలో ముస్తాబైన హీరోయిన్.. ఎంత అందంగా ఉందో! ఫొటోలు చూస్తే అంతే

హై-ఆక్టేన్ యాక్షన్,

ప్రస్తుతం చిత్రబృందం సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఇటీవలే తారక్ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుత షెడ్యూల్‌ను మంగళూరులో చిత్రీకరిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మే వరకు ఈ షెడ్యూల్ కొనసాగనున్నట్లు సమాచారం. హై-ఆక్టేన్ యాక్షన్, గ్రాండ్ విజువల్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మేకర్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరి కృష్ణ కొసరాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ 'వార్ 2' ఈ ఏడాది ఆగస్టు 14న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ సినిమాతో తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇందులో హృతిక్, తారక్ మధ్య యాక్షన్ సీక్వెన్సెస్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.  

 NTR-Neel Update | latest-news | cinema-news | telugu-news 

Also Read: Allu Aravind ఆడాళ్ళు బొద్దింకలు.. ఎందుకంటే.. వైరలవుతున్న అల్లు అరవింద్ కామెంట్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు