'భీష్మ' లాంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత నితిన్ - వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'రాబిన్ హుడ్'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. Also Read : అల్లు అర్జున్ కోసం హైదరాబాద్ వస్తున్న పవన్..! క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమా క్రిస్మస్ కు రావట్లేదు. 'రాబిన్ హుడ్' మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. Due to unforeseen circumstances, #Robinhood will not be releasing on December 25th.A new release date will be announced soon.@actor_nithiin @sreeleela14 @VenkyKudumula @gvprakash @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/gWH83pkK8k — Mythri Movie Makers (@MythriOfficial) December 17, 2024 Also Read : మరోసారి షూటింగ్ లో గాయపడ్డ ప్రభాస్..! నితిన్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ' కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా 'రాబిన్ హుడ్' చిత్రాన్ని అనుకున్న సమయానికి డిసెంబర్ 25 న రిలీజ్ చేయలేకపోతున్నాం. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. మీ ఉత్సాహాన్ని ఇంకాస్త సమయం ఓపిక పట్టండి. ఈ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ థియేటర్లలోకి వచ్చినప్పుడు మీకు కచ్చితంగా మరపురాని అనుభూతినిస్తుంది..' అని ప్రకనటలో తెలిపారు. Also Read : రాష్ట్రపతి రాకతో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్లొద్దు కాగా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పొంగల్ బరిలో జనవరి 10న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, 12 న బాలయ్య డాకు మహారాజ్,14న వెంకిమామ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఉండటంతో.. జనవరి 13 న 'రాబిన్ హుడ్' ను తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. Also Read : 'పుష్ప2' ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?