Robinhood : నితిన్ 'రాబిన్ హుడ్' రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?
నితిన్ 'రాబిన్ హుడ్' మూవీ రిలీజ్ వాయిదా పడింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా వాయిదా పడినట్లు మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేస్తామని తెలిపారు.