Thammudu OTT: ఓటీటీలోకి నితిన్ ‘తమ్ముడు’.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసిందోచ్

నితిన్ 'తమ్ముడు' సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 1, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది.

New Update

యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ అధికారికంగా ఖరారైంది. జూలై 4న రిలీజ్‌ అయిన ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా పెర్ఫార్మ్ చేయలేకపోయింది. దీంతో ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. ‘తమ్ముడు’ సినిమా ఆగస్టు 1 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో నితిన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Tammudu OTT

మాస్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'తమ్ముడు' సినిమా నితిన్‌కు మరో పరాజయాన్ని అందించింది. ఈ సినిమాలో ఆయన నటనకు, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా థియేటర్లలో విడుదలైనప్పటి నుంచే ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు స్ట్రీమింగ్ తేదీ ఖరారు కావడంతో ఇంట్లోనే ఉండి తమ అభిమాన హీరో సినిమాను చూసే అవకాశం లభించింది. 

Also Read:18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!

'తమ్ముడు' కేవలం తెలుగులోనే కాకుండా, ఇతర దక్షిణాది భాషలైన తమిళం, కన్నడ, మలయాళంలో కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది సినిమాకు మరింత మంది ప్రేక్షకులను చేరువ చేస్తుంది. కాగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, లయ, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించారు. 

Also Read:TRFను ఉగ్ర సంస్థగా ప్రకటించుకోండి.. పాక్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు