Nidhi Agarwal: హాట్ బ్యూటీ ఆశలన్నీ ప్రభాస్ పైనే.. రాజాసాబ్ కాపాడుతాడా..?

నిధి అగర్వాల్‌ టాలీవుడ్‌కి వచ్చి కొన్ని సినిమాలే చేసినా, ‘ఇస్మార్ట్ శంకర్’ తప్ప ఏవి హిట్ కాలేదు. ‘హరిహర వీరమల్లు’, ‘మిరాయ్’ సినిమాల్లోనూ నిరాశే ఎదురైంది. ఇప్పుడు ప్రభాస్‌తో చేసిన ‘రాజా సాబ్’పైనే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ఆమెకు బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

New Update
Nidhi Agarwal

Nidhi Agarwal

Nidhi Agarwal: కుర్రకారును తన అందంతో పిచ్చెక్కించే నిధి అగర్వాల్‌.. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కి వచ్చి అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే ఆమె కెరీర్‌ మాత్రం అంచనాలకు తగ్గట్టుగా సాగడం లేదు. మొదట బాలీవుడ్‌లో ‘మున్నా మైఖేల్’ సినిమాతో అరంగేట్రం చేసిన నిధి, తర్వాత తెలుగులో ‘సవ్యసాచి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

తర్వాత 'మిస్టర్ మజ్ను', 'ఇస్మార్ట్ శంకర్', 'హీరో', ‘హరిహర వీరమల్లు’ వంటి సినిమాల్లో నటించింది. కానీ ఈ చిత్రాలేవీ తనకి అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయాయి. ఒక్క 'ఇస్మార్ట్ శంకర్' మాత్రం హిట్ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా మంచి విజయంతో ఓ మోస్తరు గుర్తింపు వచ్చింది. కానీ ఆ తర్వాతి సినిమాలన్నీ నిరాశే మిగిల్చాయి.

Also Read: ఆ ఒక్క విషయంలో 'మిరాయ్' డిస్సపాయింట్ చేసిందట..! ఏంటంటే..?

ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నిధి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మీద భారీగా ఆశలు పెట్టుకున్న నిధికి మరోసారి నిరాశే ఎదురైంది. ఐదేళ్లు ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడి, ప్రమోషన్స్‌లో కూడా యాక్టివ్‌గా పాల్గొన్న నిధికి చివరికి ఈ సినిమా ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది.

Also Read: 'మిరాయ్' సినిమాపై RGV మైండ్ బ్లోయింగ్ ట్వీట్! హాలీవుడ్ రేంజ్ లో

ఆశలన్నీ ‘రాజా సాబ్’(Raja Saab) మీదే

ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఏకైక సినిమా 'రాజా సాబ్'. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో నిధి మరోసారి తన కెరీర్‌ని తిరిగి ట్రాక్‌లో పెట్టుకోవాలని ఆశపడుతోంది. మూడు సంవత్సరాలుగా ఈ సినిమాకోసం శ్రమిస్తున్నా, 'రాజాసాబ్' వాయిదాల వలయంలో చిక్కుకుపోయింది. మొదట 2024లో విడుదల కావాల్సిన ఈ సినిమా, ఇప్పుడు 2025 జనవరికి వాయిదా పడింది. ఇలా మరోసారి నిధి ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యింది.

Also Read: కనిపించి 'కన్నప్ప'ని.. వినిపించి 'మిరాయ్'ని ప్రభాస్ ఆదుకున్నాడా..?

ఇదిలా ఉంటే, టాలీవుడ్‌ తాజా హిట్ సినిమా ‘మిరాయ్’(Mirai) కోసం నిధి ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఇది ఆమె చేసిన ఫస్ట్ ఐటమ్ సాంగ్. అయితే, కథలోకి సరిపోకపోవడంతో ఆ పాటను ఎడిటింగ్‌లో తీసేశారని సమాచారం. ఇది కూడా నిధికి మరో ఎదురు దెబ్బలా మారింది.

Also Read: నా తమ్ముడికి బెస్ట్ విషెస్.. 'మిరాయ్' మూవీపై మంచు విష్ణు ట్వీట్ వైరల్..!

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ అందరూ గ్లామర్ షోతో పాటు ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఫుల్ ఆఫర్స్ అందుకుంటున్నారు. కానీ నిధికి మాత్రం అవకాశాలు దూరమవుతున్నాయి. ఆమె అందం, నటనలో ఎంతగా కష్టపడుతున్నా లక్ మాత్రం కలిసి రావడం లేదు.

ఇప్పుడు ఆమె ఆశలన్నీ ‘రాజా సాబ్’ మీదే ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే, మళ్లీ టాప్ లైన్‌కి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. లక్ రాజాసాబ్ తోనైనా ఆమె వైపు తిరుగుతుందో లేదో చూడాలి!

Advertisment
తాజా కథనాలు