Nayanthara: ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. నయనతార ఎమోషనల్ పోస్ట్
విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించిన 'నేను రౌడీనే' చిత్రం విడుదలై 9 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నయనతార తన సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ పెట్టారు. భర్త విఘ్నేశ్‌కు థ్యాంక్స్ చెబుతూ ఈ చిత్రం తన జీవితాన్ని మార్చేసిందన్నారు.