ధనుష్ అసలు రూపం బయటపెట్టిన నయనతార భర్త విగ్నేష్.. ఏమన్నాడంటే! హీరో ధనుష్‌పై నయనతార భర్త విఘ్నేష్ విరుచుకుపడ్డారు. నయనతారకు లీగల్ నోటీసులు పంపడం దుర్మార్గం అని అన్నారు. ధనుష్‌కు మంచి వాళ్లంటే ఇష్టం ఉండదని.. ఎదుటి వాళ్ల మీద ఎందుకు అంత ద్వేషం అని ప్రశ్నించారు. ధనుష్ అసలు రూపం ఏంటో ఫ్యాన్స్ తెలుసుకోవాలని కోరారు. By Seetha Ram 17 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా నయనతారకు లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. దీనిపై నయన్ భర్త విఘ్నేష్ శివన్ తాజాగా స్పందించి ధనుష్‌పై విరుచుకుపడ్డారు. ధనుష్ చేసింది ముమ్మాటికి తప్పు అని విఘ్నేష్ పేర్కొన్నారు. ఈ మేరకు నయనతారకు.. ధనుష్ పంపిన లీగల్ నోటీసును విఘేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. Also Read: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ఇద్దరు స్టార్ సింగర్స్.. ఫొటోలు వైరల్ ధనుష్‌కు మంచి వాళ్లంటే ఇష్టం ఉండదని పేర్కొన్నారు. ఎదుటి వాళ్ల మీద ఎందుకు అంత ద్వేషం అని ప్రశ్నించారు. షూటింగ్ టైంలోను ఎంతో ఇబ్బంది పెట్టాడు అని ఆరోపించారు. ధనుష్ అసలు రూపం ఏంటో ఫ్యాన్స్ తెలుసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ధనుష్ అభిమానులను ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. Also Read: పెళ్ళైన నాలుగు నెలలకే రాధికా ఆ విషయంలో సంచలన నిర్ణయం..! అందరూ అనుకున్నట్లు ధనుష్ అంత మంచివాడు కాదని అన్నారు. ఈ విషయాన్ని అందరూ తెలుసుకుంటారని తాను దేవుణ్ణి వేడుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ధనుష్ కోరిన రూ.10 కోట్ల విలువగల వీడియో ఇదే అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది? Also Read: చైనాలో దారుణం.. కత్తి దాడిలో 8 మంది మృతి నయనతార, విజయ్ సేతుపతి జంటగా 'నానున్ రౌడీ దాన్' (నేను రౌడీనే) అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. విగ్నేష్ శివన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ టైమ్ లోనే నయన్ - విగ్నేష్ ప్రేమలో పడ్డారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. కాగా ధనుష్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. నయనతార పెళ్లి, జీవిత విశేషాలతో 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 18న డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తున్నారు. Also Read: ‘నెట్ స్పీడ్ పెరిగిందో మీ పని ఖతం.. బాడీలో ఆ పార్ట్‌కు ముప్పు’ ఇటీవలే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో 'నేనే రౌడీనే' మూవీ షూటింగ్ టైంలో తీసిన 3 సెకన్ల వీడియో క్లిప్ ఉపయోగించారు. తన అనుమతి లేకుండా మూవీ బిట్స్ ఉపయోగించడంపై నిర్మాత ధనుష్ సీరియస్ అయ్యాడు. కాపీరైట్ యాక్ట్‌లో భాగంగా లీగల్ నోటీసులు జారీ చేశాడు. ఏకంగా రూ.10 కోట్లు డిమాండ్ చేశాడు. #vignesh-shivan #nayanthara #hero-dhanush మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి