Daaku Maharaj: నారా లోకేష్ గెస్ట్ గా 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే?

బాలకృష్ణ లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 9 న నిర్వహించనున్నారు. అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో ఈ భారీ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ హాజరవుతున్నారు. ఈవెంట్ వివరాలను మేకర్స్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.

New Update
daku maharaj pre release event

balayya nara lokesh

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్' సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మూవీ టీమ్ కూడా వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేస్తూ నెక్స్ట్ లెవెల్ లో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. 

ఇందులో భాగంగానే చిత్రబృందం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ను గ్రాండ్ గా ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ కు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించారు. జనవరి 9న సాయంత్రం 5 గంటలకు అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో ఈ భారీ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 

అలాగే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ హాజరవుతున్నారని వెల్లడించారు.' ఈ సంక్రాంతి సునామీకి ప్రారంభం అనంతపురం నుండి! డాకు మహారాజ్ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ జనవరి 9న జరగనుంది. ముఖ్య అతిథిగా నారా లోకేష్ విచ్చేస్తున్నారు..' అంటూ నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది.

Also Read : 'రాజాసాబ్' పై అంచనాలు పెట్టుకోకుండా ఉంటే బెటర్.. థమన్ షాకింగ్ కామెంట్స్

బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా నటించగా.. బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రల్లో మెరవనున్నారు. 

సంక్రాంతి  బరిలో 'డాకు మహారాజ్' సినిమాకు పోటీగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేష్ సంక్రాంతి చిత్రాలు కూడా విడుదలవుతున్నాయి. ఈ మూడు సినిమాలు డిఫెరెంట్ జోనర్స్ తో తెరకెక్కాయి. మూడు సినిమాలపై భారీ హైప్ కూడా ఉంది. దీంతో ఈ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో సంక్రాంతి విన్నర్ గా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి.

Also Read : 'పుష్ప' చీటింగ్.. మూవీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్

Advertisment
తాజా కథనాలు