/rtv/media/media_files/2025/02/22/Zht6cvdZOiQCudejm58T.jpg)
Nani Dasara 2 Movie Updates
Nani Dasara 2 Movie Updates: న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మూవీ 'దసరా'.. 2023 మార్చ్ 30న విదుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 121కోట్లు కొల్లగొట్టింది. అయితే ఈ మూవీకి సీక్వెల్ గా దసరా 2 సినిమాని ప్రకటించినప్పటికీ, రోజులు గడుస్తున్నాయి కానీ సెట్ వర్క్ మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ సెట్ వర్క్ పూర్తయ్యాకే సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఇది భారీ బడ్జెట్ సినిమా కావడం వల్ల, ఈ ప్రాజెక్టు కోసం ఎక్కువ సమయం పడుతోంది. ఈ కారణంగానే హీరో నాని, ముందుగా మైత్రీ మూవీ మేకర్స్‌తో మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు.
Also Read: Punjab: 405 రోజులు... 10 దేశాలు... 41 లక్షల రూపాయలు.. చేరిన గమ్యం.. కానీ అంతలోనే!
అయితే రెండు సినిమాలను ఒకేసారి చేయడానికి నానికి సమయం కుదరుతుందా అనే అనుమానం ఉంది. ఎందుకంటే, 'దసరా 2' సినిమాకి ఒక ప్రతేకమైన స్థానం ఉంది. ఇందులో నాని గెటప్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉండబోతోంది.
Also Read: Viral News: రిసెప్షన్‌కు ముందు బ్యూటీపార్లర్‌కు వెళ్లొస్తానని..ప్రియుడితో జంప్ అయిన నవవధువు!
'దసరా 2' ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..!
మైత్రీ మూవీస్, శిబి చక్రవర్తి కాంబినేషన్‌లో నాని ఎంటర్‌టైనర్ జోనర్ లో ఒక కొత్త మూవీ చేయబోతున్నారు. నాని ఈ సినిమాను ముందుగా పూర్తి చేసి 2025లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. అలా చేస్తే ఈ ఏడాది నాని నుండి రెండు సినిమాలు విడుదల అవుతాయి. ఒకవేళ ఈ సినిమా 2025లో రాకపోతే మాత్రం ఈ ఏడాది నాని నుండి ఒక్క 'హిట్' సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
అలా అని నాని రెండు సినిమాలు పూర్తి చేసినా అవి అయ్యేసరికి 'దసరా 2' సినిమా మరింత ఆలస్యం అవుతుంది. 'దసరా 2' సినిమాపై ఇప్పటికే పెద్ద మొత్తంలో ఖర్చులు పెడుతున్నారు. భారీ సెట్‌లు, అడ్వాన్స్‌లు, ఆఫీస్ ఖర్చులు అన్నీ ఒక రేంజ్ లో ఉన్నాయి.
Also Read: Trump-Musk:మస్క్ కుమారుడి అల్లరి వల్ల 145 సంవత్సరాల డెస్క్ మార్చేసిన ట్రంప్!