ఫస్ట్ సినిమానే పట్టాలెక్కలేదు.. అప్పుడే రెండో సినిమాకు సైన్ చేసిన మోక్షజ్ఞ బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ.. తన మొదటి సినిమా పట్టాలెక్కక ముందే, అప్పుడే రెండో సినిమాకి సైన్ చేసినట్లు తాజా సమాచారం బయటికొచ్చింది. మోక్షజ్ఞ రెండో సినిమా వెంకీ అట్లూరి తో ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుందని తెలుస్తోంది. By Anil Kumar 02 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 'హనుమాన్' మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమాని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ''యాక్షన్ కి సిద్ధంగా ఉండండి.. #సింబా కమింగ్'' అంటూ ప్రశాంత్ వర్మ రీసెంట్ గా షేర్ చేసిన మోక్షజ్ఞ లేటెస్ట్ పిక్ బాగా వైరల్ అయింది. వెంకీ అట్లూరి తో రెండో సినిమా.. ఈ మధ్యే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 5 న పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే మొదటి సినిమా పట్టాలెక్కక ముందే మోక్షజ్ఞ.. అప్పుడే తన రెండో సినిమాకి సైన్ చేసినట్లు తాజా సమాచారం బయటికొచ్చింది. మోక్షజ్ఞ రెండో సినిమా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తో ఉండబోతోంది. #FilmyTollywood Exclusive :Mokshagna Film Opening on 5th December & Shoot from January. pic.twitter.com/oiuZAJfIxM — Filmy Tollywood (@FilmyTwood) December 1, 2024 Also Read : ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్..మెగా హీరో షార్ట్ ఫిలింకి అరుదైన పురస్కారం ఇటీవలే ఈ దర్శకుడు 'లక్కీ భాస్కర్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ డైరెక్టర్ తన తదుపరి ప్రాజెక్ట్ ను మోక్షజ్ఞతో చేయబోతున్నాడని, దీన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుందని తెలుస్తుంది. Also Read : బాలీవుడ్ లో 'పుష్ప'మేనియా.. ప్రీ సేల్స్ బుకింగ్స్ లో నయా రికార్డ్ #Exclusive : Mokshagna 2nd Movie 🔥🔥🔥Mokshu - venky atluri - sithara ents 👍💥🔥2nd Movie Also Locked 🔒🔥🔥👍@SitharaEnts #VenkyAtluri pic.twitter.com/FptLs4w1I8 — Nandamuri Mokshagna Teja (@Mokshagna_Actor) December 1, 2024 సితార ఎంటర్టైన్మెంట్స్ తో బాలయ్యకు మంచి బాండింగ్ ఉంది. వీరి నిర్మాణంలో బాలయ్య ప్రెజెంట్ 'డాకు మహారాజ్' సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సితార ఎంటర్టైన్మెంట్స్.. మోక్షజ్ఞ రెండో సినిమాని లాక్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. Also Read : 'పుష్ప2' ప్రీ రిలీజ్ చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్.. నాగబాబు పోస్ట్ వైరల్ Also Read: తెరపైకి మోహన్‌బాబు మనవరాళ్లు.. 'కన్నప్ప' పోస్టర్ వైరల్ #tollywood #director venky atluri #mokshagna #mokshagna-nandamuri మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి