'పుష్ప2' ప్రీ రిలీజ్ చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్.. నాగబాబు పోస్ట్ వైరల్

'పుష్ప2' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవ్వాళ యూసుఫ్ గూడ పోలిస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా జరగనుంది. ఇప్పటికే అందుకు సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయి. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారని తాజా సమాచారం బయటికొచ్చింది.

New Update

అల్లు - మెగా వివాదం వేళ ఆసక్తికర వార్త బయటికొచ్చింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప2' మూవీ డిసెంబర్ 5 న విడుదల కానున్న నేపథ్యంలో ఇవ్వాళ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్ గూడ పోలిస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా జరగనుంది. ఇప్పటికే అందుకు సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయి. ఈవెంట్ లో ఎలాంటి గొడవలు జరగకుండా ప్రత్యేక పోలీస్ బృందాలను సైతం దించుతున్నారు. 

మెగాస్టార్ గెస్ట్ గా..

ఇదిలా ఉంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారని తాజా సమాచారం బయటికొచ్చింది. ఇటీవల ఏపీ ఎలక్షన్స్ టైం లో బన్నీ.. పవన్ కు సపోర్ట్ చేయకపోవడం, ఈ మధ్య నాగబాబు, వరుణ్ తేజ్.. బన్నీ పై ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేయడం లాంటి సంఘటనలు మెగా - అల్లు కుటుంబాల మధ్య వైరాన్ని మరింత పెంచాయి. 

Also Read : బాలీవుడ్ లో 'పుష్ప'మేనియా.. ప్రీ సేల్స్ బుకింగ్స్ లో నయా రికార్డ్

దీంతో ఫ్యాన్స్ కూడా రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో అటాక్ చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో 'పుష్ప2' ప్రీ రిలీజ్ కి చిరు గెస్ట్ గా రాబోతున్నారనే వార్త సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ గా మారింది. తమ కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని అందరికి తెలియాలనే మెగాస్టార్.. ఈ ఈవెంట్ కి రాబోతున్నారని మెగా సన్నిహిత వర్గాల సమాచారం. 

నాగబాబు ట్వీట్ వైరల్..

మరోవైపు తాజాగా  నాగబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ''నువ్వు త‌ప్పుడు దారిలో వెళ్తున్నావ‌ని నువ్వే గుర్తిస్తే వెంట‌నే నీ దారిని మార్చుకో. నువ్వు ఆల‌స్యం చేసే కొద్దీ, నువ్వు నిజంగా ఎక్క‌డి వాడివో అక్క‌డికి వెళ్ల‌డం మ‌రింత క‌ష్టంగా మారుతుంది" అంటూ స్వామివివేకానంద కొటేషన్ పెట్టారు.

అయితే అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఈ స్థానంలో ఉండడానికి తన నటనతో పాటు మెగాస్టార్ ప్రోత్సాహం, సపోర్ట్ కూడా ఉందని చెబుతుంటారు. కానీ అల్లు అర్జున్ ఈ మధ్య చాలా ఈవెంట్లలో తన నటనే తనను ఈ స్థాయిలో నిలబెట్టింది అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ''నువ్వు ఆల‌స్యం చేసే కొద్దీ, నువ్వు నిజంగా ఎక్క‌డి వాడివో అక్క‌డికి వెళ్ల‌డం మ‌రింత క‌ష్టంగా మారుతుంది" అంటూ నాగబాబు చేసిన ట్వీట్ పరోక్షంగా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ  పెట్టినట్లుగా ఉందని నెటిజన్లు అనుకుంటున్నారు.

Also Read: Aviation : 17 ఏళ్లలో ఐదింటి కథ ముగిసింది..విమానయాన రంగం కుదేలు!

 

#allu-arjun #chiranjeevi #pushpa-2
Advertisment
Advertisment
తాజా కథనాలు