/rtv/media/media_files/2024/11/14/QYGjn2yDTlBdMKJyJ0kC.jpg)
ఇటీవలే 'ఫ్యామిలీ స్టార్' సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది.
Also Read : Revanth Reddy: కొడంగల్‌లో అసలేం జరుగుతోంది.. ఫార్మాసిటీని రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ మాసివ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ మూవీ నుంచి త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేయనున్నారట మేకర్స్.
Also Read : Aghori: నడిరోడ్డుపై వాడి పురుషాంగం కొయ్యబోతున్నా.. హైదరాబాద్ లో అఘోరీ సంచలనం!
Nandamuri Balakrishna - Vijay Devarakonda
Inkosari Trollers ki Rod Dimpaadu 😂💥!..@TheDeverakonda 😈!....
— therajamohan - ANONYMOUS SPY (@therajamohan) November 10, 2024
E Attitude tho ney vundu AnnA ❤️💥!...#VD12pic.twitter.com/qRIgPJ89PT
Also Read : Revanth: రాష్ట్రంలో 5 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలు క్లోజ్.. సీఎం రేవంత్ సంచలనం!
బాలయ్య వాయిస్ ఓవర్..
అయితే ఈ టీజర్‌కు నందమూరి నటసింహం బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్తలు ఫిలిం సర్కిల్స్ లోనూ వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి. కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా కనిపించనుంది. వచ్చే ఏడాది మార్చి 25న చిత్రం రిలీజ్ కానుంది.
Also Read : Diabetes: ప్రపంచ మధుమేహ దినోత్సవం.. ఈ విషయాలు తెలియకపోతే కష్టం..!