రష్మిక ఆ హీరోనే పెళ్లి చేసుకుంటుంది.. బాలయ్య ముందే లీక్ చేసిన నాగవంశీ

'అన్ స్టాపబుల్' షోలో రష్మిక పెళ్లి ప్రస్తావన వచ్చింది. షోలో బాలయ్య రష్మికకు పెళ్లి సెట్ అయినట్టు ఉంది కదా అని అంటే.. దీనికి నిర్మాత నాగవంశీ, తెలుగు హీరోని పెళ్లి చేసుకుంటుందని తెలుసు సర్, కానీ ఎవరు? ఏంటి? అనేది మాత్రం చెప్పట్లేదు ఇంకా అని అన్నారు.

New Update

టాలీవుడ్ ఆన్ స్క్రీన్ పెయిర్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన రిలేషన్‌లో ఉన్నట్లు ఎంతో కాలం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. విజయ్ వెకేషన్ వెళ్లే ప్లేస్ కు రష్మిక కూడా వెళ్లడం, విజయ్ ఇంట్లోనే ప్రతి పండగను జరుపుకోవడం లాంటివి ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. 

పైకి ఈ జంట ఫ్రెండ్స్ అంటూ చెబుతున్నా.. ఫ్యాన్స్ మాత్రం వీళ్ళు సీక్రెట్ రిలేషన్ మైంటైన్ చేస్తున్నారని చెప్తుంటారు. అయితే రీసెంట్ గా చెన్నైలో జరిగిన 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పెళ్లి, ప్రియుడి గురించి టాపిక్ రాగానే రష్మిక తెగ సిగ్గుపడిపోయింది. నేను చేసుకోబోయేది ఎవరో మీకు కూడా తెలుసుగా! అని సమాధానమిచ్చింది. ఇక తాజాగా రష్మిక పెళ్ళిపై నిర్మాత నాగవంశీ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Also Read : దెయ్యంగా మారనున్న బుట్టబొమ్మ.. భయపెడుతుందా?

'డాకు మహారాజ్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ బాబీ, నిర్మాత నాగవంశీ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. 'అన్‌స్టాప‌బుల్‌' షో'లో సందడి చేశారు. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమో వదిలారు. ఇందులో బాలయ్య.. 'నాకు రష్మిక అంటే క్రష్, రష్మికకు పెళ్లి సెట్ అయినట్టు ఉంది కదా!' అని అన్నారు. 

పెళ్లి తెలుగు హీరోతోనే..

దీనికి నిర్మాత నాగవంశీ రియాక్ట్ అయ్యారు.' తెలుగు ఇండస్ట్రీలో హీరోని పెళ్లి చేసుకుంటుందని తెలుసు సర్, కానీ ఎవరు? ఏంటి? అనేది మాత్రం చెప్పట్లేదు ఇంకా..' అని అన్నారు. దీంతో నాగవంశీ కామెంట్స్ వైరల్ గా మారాయి. తెలుగు హీరోని పెళ్లి చేసుకుంటుందని చెప్పడంతో ఆ హీరో విజయ్ దేవరకొండ అని సోషల్ మీడియాలో అప్పుడే  డిస్కషన్ మొదలైంది. 

Also Read : మరో వివాదంలో చిక్కుకున్న మంచు ఫ్యామిలీ

రష్మిక తెలుగు హీరోని పెళ్లి చేసుకుంటుందని  నాగవంశీ స్వయంగా బాలయ్య ముందే చెప్పడంతో మరోసారి విజయ్ దేవరకొండ - రష్మిక  ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకుంటారని అంతా ఫిక్స్ అయిపోయారు. మరి నిజంగానే ఈ జంట రానున్న రోజుల్లో గుడ్ న్యూస్ చెప్తారేమో చూడాలి.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు