/rtv/media/media_files/2025/02/27/AsRHHomt9upaoASGKsyY.jpg)
nagarjuna hero
BIG BREAKING: అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తన కుటుంబానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి, అక్కినేని నాగేశ్వర్ రావు వీరాభిమాని యద్దుల అయ్యప్పరెడ్డి మరణించడంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు అభిమాని మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ నాగార్జున ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "అక్కినేని కుటుంబానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి యద్దుల అయ్యప్పరెడ్డి మరణించడం నన్ను బాగా కలచివేసింది. ఆయన నాన్నగారికి వీరాభిమాని. అలా మాకు, మా కుటుంబానికి కూడా ఎంతో దగ్గయ్యారు. ఇన్నాళ్ల పాటు అక్కినేని కుటుంబానికి మూల స్తంభంగా ఉన్నారు. మా కుటుంబం పై ఆయన చూపిన ప్రేమ, అభిమానం ఎప్పటికీ మరచిపోలేను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఈ కష్టకాలం నుంచి వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను" అంటూ భావోద్వేగానికి గురయ్యారు నాగ్.
Also Read: Shruti Hasan: శృతి హాసన్ హాలీవుడ్ ఎంట్రీ.. 'The Eye' ట్రైలర్ చూశారా?
Deeply saddened by the passing of Yeddhula Ayyappa Reddy garu, he was ardent fan of my father, ANR garu and pillar of strength for the Akkineni family.
— Nagarjuna Akkineni (@iamnagarjuna) February 26, 2025
His love and affection to us can never be forgotten 🙏
My deepest condolences to his family, and may God give them the strength… pic.twitter.com/6i2k3ycNUt
అక్కినేని ఫ్యామిలీకి అభిమాని
యద్దుల అయ్యప్ప రెడ్డి కర్నూల్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన ఎంతో కాలం నుంచి అక్కినేని కుటుంబానికి అభిమాని. అక్కినేని కుటుంబానికి సంబంధించిన ప్రతి పనిలో ఆయన సహకారం అందించేవారట. అలాగే నాగార్జున ఇంట్లో జరిగే ప్రతీ శుభకార్యంలోనూ పాల్గొనే వారని సమాచారం.
Also Read: Lucky Baskhar: ఇదేం క్రేజ్ రా బాబు.. 'లక్కీ భాస్కర్' ఎక్కడ వదలట్లేదు.. నెట్ ఫ్లిక్స్ లో మరో రికార్డు