Shruti Hasan: శృతి హాసన్  హాలీవుడ్ ఎంట్రీ.. 'The Eye' ట్రైలర్ చూశారా?

నటి శృతి హాసన్  హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. తాజాగా ఆమె నటించిన బ్రిటీష్ ఫిల్మ్ 'The Eye' ట్రైలర్ రిలీజ్ చేశారు. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి  డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించారు. ఈ ట్రైలర్ మీరు కూడా చూసేయండి. 

New Update

The Eye Trailer: కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా  ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ నటన నైపుణ్యంతో తనదైన గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అన్ని పరిశ్రమల్లోనూ మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం శృతి హాలీవుడ్ లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. బ్రిటీష్ చిత్రం  'The Eye' తో అంతర్జాతీయ అరంగేట్రం చేయనుంది. నటుడు మార్క్ రౌలీ, శృతి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. 

 'The Eye'  ట్రైలర్ 

డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈరోజు నుంచి ప్రారంభం కానున్న 5th వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానుంది. ఈ సందర్భంగా శృతి నటనను హైలైట్ చేస్తూ తాజాగా చిత్రబృందం ట్రైలర్ రిలీజ్ చేసింది. 'The Eye' డయానా(శృతి హాసన్) అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె భర్త ఫెలిక్స్  (మార్క్ రౌలీ) ఒక మారుమూల ద్వీపంలో తన మునిగిపోవడం చూస్తుంది డయానా. భర్త కనిపించకపోవడంతో దుఃఖంతో పోరాడుతున్న ఆమె ఎలాగైనా భర్త ఫెలిక్స్ ని  తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది. 

ఈవిల్ ఐ ఆచారం

ఈ క్రమంలో ఆమె భర్తను తీసుకురావడానికి మార్గమైన పురాతన ఆచారం అయిన ఈవిల్ ఐ ఆచారానికి ఆకర్షితురాలవుతుంది. అసలు ఈవిల్ ఐ ఆచారం అంటే ఏంటి? దాని వల్ల ఆమెకు ఎదురైన సమస్యలేంటి? డయానా భర్త తిరిగి వచ్చాడా? అనే అంశాలతో సినిమా ఉంటుంది. ఇందులో శృతి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తన నటనా నైపుణ్యాలను ప్రదర్శించినట్లు తెలుస్తోంది. కొన్ని బోల్డ్ సన్నివేశాలలో కూడా తన ఉనికిని చాటుకుంది.

ఇప్పటికే  'The Eye' చిత్రాన్ని లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్,  గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించడంతో అంతర్జాతీయ గుర్తింపును పొందింది.  'The Eye' ఇండియన్ ప్రీమియర్ సందర్భంగా శృతి మాట్లాడుతూ.. సినిమా కథాంశం, అత్యుత్తమ నిర్మాణ నాణ్యతలకు ఈ ప్రాజెక్ట్ మరింత ప్రత్యేకమైనదని తెలిపింది. కథలో ఇంటెన్సిటీని పెంచడానికి గ్రీస్ లోని  ఏథెన్స్,  కోర్ఫులోని సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించినట్లు తెలిపారు. 

Also Read: Lucky Baskhar: ఇదేం క్రేజ్ రా బాబు.. 'లక్కీ భాస్కర్' ఎక్కడ వదలట్లేదు.. నెట్ ఫ్లిక్స్ లో మరో రికార్డు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు