గ్రాండ్ గా 'గేమ్ ఛేంజర్' టీజర్ లాంచ్ ఈవెంట్.. ఎప్పుడు, ఎక్కడంటే?

'గేమ్‌ ఛేంజర్' టీజర్ ను నవంబర్ 9న లాంచ్ చేయబోతున్నారు మేకర్స్. టీజర్‌ లాంచ్ ఈవెంట్‌ను లక్నోలో నిర్వహించనున్నట్టు తెలుపుతూ మూవీ టీమ్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. పోస్టర్ లో రామ్ చరణ్ కుర్చీపై కూర్చొని ఉండగా ఆయన ముందు ఓ టేబుల్ పై ల్యాప్ టాప్ కనిపిస్తోంది.

New Update
rhfdh

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'గేమ్ ఛేంజర్' టీజర్ ఈ వారమే రిలీజ్ కాబోతుంది. టీజర్ తోనే మూవీ టీమ్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నారు. అయితే టీజర్ ను సింపుల్ గా కాకుండా ఓ భారీ ఈవెంట్ పెట్టి మరీ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. 

నవంబర్ 9న 'గేమ్‌ ఛేంజర్' టీజర్ లాంచ్ చేయబోతున్నామని.. టీజర్‌ లాంచ్ ఈవెంట్‌ను లక్నోలో నిర్వహించనున్నట్టు తెలుపుతూ మూవీ టీమ్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. పోస్టర్ లో రామ్ చరణ్ కుర్చీపై కూర్చొని ఉండగా ఆయన ముందు ఓ టేబుల్ పై ల్యాప్ టాప్ కనిపిస్తోంది. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నా ఈవెంట్ హైదరాబాద్ లో లేదని తెలిసి కొంత నిరాశ చెందుతున్నారు.

Also Read : వామ్మో.. 'కంగువా' అన్ని వేల స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందా?

 నార్త్ లో టీజర్ లాంచ్ ఈవెంట్..

మాములుగా స్టార్ హీరోల సినిమా టీజర్స్ ను తెలుగు రాష్ట్రాల్లోనే  ఈవెంట్ నిర్వహించి రిలీజ్ చేస్తారు. కానీ శంకర్ అండ్ టీమ్ మాత్రం అందుకు భిన్నంగా ఈసారి నార్త్ నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. మొత్తానికి మరో మూడు రోజుల్లో మెగా ట్రీట్ రాబోతుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేశారు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ, అంజలి ఫీ మేల్‌ లీడ్ రోల్స్‌ పోషిస్తున్నారు. 

శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు సుమారు రూ.200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నవీన్‌ చంద్ర, సునీల్, శ్రీకాంత్‌, కోలీవుడ్ యాక్టర్లు ఎస్‌జే సూర్య, స‌ముద్రఖని, కన్నడ నటుడు జ‌య‌రామ్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : 'జై హనుమాన్' లో మరో స్టార్ హీరో.. ప్రశాంత్ వర్మ ప్లానింగ్ వేరే లెవెల్

Also Read : వామ్మో.. 'కంగువా' అన్ని వేల స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందా?

Also Read : ఓటీటీలోకి వచ్చేస్తున్న ఎన్టీఆర్ .. 'దేవర' స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు