ఓవర్సీస్‌లో పుష్ప 2 వైల్డ్ ఫైర్.. రప్పా రప్పా లాడించిన బన్నీ

అల్లు అర్జున్ 'పుష్ప2' ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. ముఖ్యంగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. అమెరికాలో తొలిరోజు దాదాపు 4.2 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది.

New Update

Pushpa 2:  'పుష్ప' పార్ట్ 1తో అల్లు అర్జున్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.   ఈ సినిమాలో అల్లు అర్జున్  అతనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను చేసింది.  పార్ట్1 భారీ విజయాన్ని సాధించడంతో పార్ట్ పై కూడా  అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంచనాలకు తగ్గట్లే డిసెంబర్ 5న విడుదలైన 'పుష్ప2' బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సౌత్, నార్త్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు ఓపెనింగ్స్ తో దుమ్మురేపుతోంది. 

ఓవర్ సీస్ లోనూ  'పుష్ప2'  మేనియా 

అల్లు అర్జున్ 'పుష్ప2'  క్రేజ్ కేవలం  భారతదేశంలోనే కాదు ఓవర్సీస్‌లో కూడా కనిపిస్తోంది.  ముఖ్యంగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా  దేశాల్లో  ప్రీమియర్‌ షోలు వేయగా మంచి స్పందన లభించింది. ఓవర్ సీస్ లో పలు చోట్ల  రికార్డ్-బ్రేకింగ్ నంబర్‌లను నమోదు చేసింది. నార్త్ అమెరికాలో తొలిరోజు  4.2 మిలియన్ల డాలర్లు(35 కోట్ల పైనే)   వసూలు చేసింది.  అమెరికాలో ఈ స్థాయిలో వసూళ్లు చేసిన మూడో చిత్రంగా పుష్ప2 రికార్డు క్రియేట్ చేసింది. 

UK-ఐర్లాండ్ బాక్సాఫీస్ వద్ద ప్రీమియర్స్ లో ఆల్-టైమ్ రికార్డ్ కలెక్షన్‌ను నమోదు చేసింది. దీంతో ఓవర్ సీస్ లో అల్లు అర్జున్ క్రేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. UK-ఐర్లాండ్ బాక్సాఫీస్  వద్ద ప్రీమియర్స్ ద్వారా  'పుష్ప 2'  3.04 కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది. UK-ఐర్లాండ్‌లో ప్రీమియర్‌ల ద్వారా 3 కోట్ల మార్కును దాటిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు 'కల్కి2898 AD రూ. 2.65 కోట్లు వసూళ్లు చేయగా.. దేవర రూ. 2. 43 కోట్లు సాధించింది.   

యూరప్, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో  కూడా పుష్ప 2కు మంచి ఆదరణ లభిస్తోంది. ఆకట్టుకునే కథ, సినిమాలో పుష్ప మ్యానరిజం, యాక్షన్, విజువల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఓవర్ సీస్ లో విడుదలైన గత తెలుగు సినిమాలతో పోలిస్తే  'పుష్ప2' పెద్ద హిట్టుగా నిలిచింది.  

 

ఓవర్ సీస్ లో విజయానికి కారణాలు 

అల్లు అర్జున్ క్రేజ్ 

పుష్ప పార్ట్ 1తో అల్లు అర్జున్ స్టార్డమ్ విపరీతంగా పెరిగిపోయింది. అతని మాస్ అపీల్, ఐకానిక్ స్టైల్ ప్రపంచవ్యాప్తంగా  ప్రేక్షకులు తన వైపు తిరిగేలా చేసింది. ఇప్పుడు పుష్ప2 విషయంలో కూడా అదే జరిగింది. 

తెలుగు సినిమాల ఆదరణ 

బాహుబలి తర్వాత  ఓవర్సీస్ మార్కెట్‌లో తెలుగు చిత్రాలకు డిమాండ్ గమనీయంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే RRR, KGF, పుష్ప పార్ట్1  బాహుబలి వంటి చిత్రాలు ఇండియన్ సినిమా రేంజ్ ని ప్రపంచ స్థాయికి పెంచాయి. పుష్ప2 లో సుకుమార్ డైరెక్షన్, విజువల్స్, దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాకు ప్రత్యేకతను ఇచ్చాయి. ఆక్షన్ సీన్స్,  విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల్ని మెప్పించాయి.

Also Read : 'పుష్ప2' జాతర ఎపిసోడ్.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మురిసిపోయిన బన్నీ, వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు