కిరణ్ అబ్బవరంకు అక్కినేని హీరో సపోర్ట్.. 'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా? కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ 'క' అక్టోబర్ 31 న విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ 29 న నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా అక్కినేని నాగ చైతన్య రానున్నాడు. యంగ్ హీరో కిరణ్ కోసం చైతూ తన వంతుగా సపోర్ట్ అందించనున్నాడు. By Anil Kumar 28 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ 'క'. ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు. సందీప్ - సుజిత్ అనే కొత్త డైరెక్టర్స్ తీసిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఇటీవల వచ్చిన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే కిరణ్ అబ్బవరం ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు వరుస ఈవెంట్స్ లో పాల్గొంటున్నాడు. మీడియా చిట్ చాట్, మీమర్స్ తో ఇంటర్వ్యూ, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్ తో రీల్స్.. ఇలా ఏ ఒక్కటి వదల్లేదు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ 29th మంగళవారం సాయంత్రం నిర్వహిచబోతున్నారు మేకర్స్. Also Read : ఇట్స్ అఫీషియల్, రెండు భాగాలుగా 'SSMB29'.. బడ్జెట్ రివీల్ చేసిన టీమ్ గెస్ట్ గా చైతూ.. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా అక్కినేని నాగ చైతన్య రానున్నాడు. యంగ్ హీరో కిరణ్ కోసం నాగ చైతన్య తన వంతుగా సినిమాను సపోర్ట్ చేయడం విశేషం అనే చెప్పాలి. ఈ ఈవెంట్ కు చైతూ గెస్ట్ అని తెలియడంతో అక్కినేని ఫ్యాన్స్ సైతం ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చైతూ కంటే ముందు నాగార్జున కూడా 'క' సినిమాకు తన వంతు సపోర్ట్ ను బిగ్ బాస్ 8 షో ద్వారా అందించారు. 'క' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ యూనిట్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 లోనూ సందడి చేసింది. కిరణ్ అబ్బవరం తన గత సినిమాలకు చేయనంత ప్రమోషన్స్ ను 'క' కోసం చేస్తుడటంతో ఈ సినిమాతో ఎలాగైనా అతనికి సక్సెస్ రావాలని కామన్ ఆడియన్స్ కోరుకుంటున్నారు. Also Read : కెరీర్ లో ఫస్ట్ టైం గెస్ట్ రోల్ లో మహేష్ బాబు.. ఏ సినిమాలో అంటే? #nagachaitanya #ka #kiran-abbavaram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి