కెరీర్ లో ఫస్ట్ టైం గెస్ట్ రోల్ లో మహేష్ బాబు.. ఏ సినిమాలో అంటే?

మహేష్ బాబు తన అల్లుడి సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపిస్తారని లేటెస్ట్ న్యూస్ బయటికొచ్చింది. అశోక్ గల్లా 'దేవకీ నందన వాసుదేవ' మూవీలో మహేశ్‌ శ్రీకృష్ణుడిగా కనిపించనున్నారట. ఈ మేరకు చిత్రబృందం మహేశ్‌ను ఒప్పించి ఇప్పటికే ఆయన సీన్స్ ను షూట్‌ చేశారని టాక్‌.

New Update
mahesh12

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి 'SSMB29' సినిమా కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. రాజమౌళి ఈ సినిమా కోసం లొకేషన్స్ వెతికే పనిలో పడ్డారు. అటు మహేష్ మాత్రం తన మేకోవర్ తో పాటూ ఫిజిక్ పై ద్రుష్టి సారించారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది. ఇక సినిమాకు కనీసం రెండేళ్లయినా పడుతుంది. 

అప్పటిదాకా మహేష్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోను బిగ్ స్క్రీన్ పై చూడటం కష్టమే. అయితే 'SSMB29' కంటే ముందే మహేష్ మరో సినిమాలో కనిపించబోతున్నారు. అదికూడా తన అల్లుడి సినిమాలో మహేష్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారని లేటెస్ట్ న్యూస్ బయటికొచ్చింది. అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దేవకీ నందన వాసుదేవ'. ఈ సినిమాకు 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. 

Also Read : అల్లు అర్జున్ కు తెలంగాణ పోలీసుల ఎదురుదెబ్బ..'పుష్ప2' కు ఊహించని షాక్?

శ్రీ కృష్ణుడి పాత్రలో..

అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోనే మహేశ్‌బాబు అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. క్లైమాక్స్‌లో శ్రీ కృష్ణుడికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉంటాయని.. అందులో మహేశ్‌ నటిస్తే బాగుంటుందని చిత్రబృందం భావించిందని తెలుస్తోంది. ఈ మేరకు చిత్రబృందం మహేశ్‌ను ఒప్పించి ఇప్పటికే ఆయన సీన్స్ ను షూట్‌ చేశారని టాక్‌. 

Also Read : కిరణ్ అబ్బవరం అంటే తమిళ స్టార్స్ భయపడుతున్నారా?

సినిమా క్లైమాక్స్‌లో మహేశ్.. కృష్ణుడి అవతారంలో దర్శనమివ్వనున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటూ ఇటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. ఈ న్యూస్ తో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అశోక్ గల్లా సరసన మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తుండగా.. సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు