ఇట్స్ అఫీషియల్, రెండు భాగాలుగా 'SSMB29'.. బడ్జెట్ రివీల్ చేసిన టీమ్

సినీ క్రిటిక్ మనోబాలా తన ఎక్స్ వేదికగా 'SSMB29' మూవీ రెండు పార్టులుగా ఉంటుందని చెబుతూనే బడ్జెట్ రివీల్ చేశారు. SSMB29 రూ.1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడుతుంది. రాజమౌళి దర్శకత్వం వహించనున్నఈ భారీ బడ్జెట్ చిత్రం రెండు భాగాలుగా రూపొందించబడుతుందని తెలిపారు.

New Update
ssrmb29

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి నుంచి ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ 'SSMB29'. 'RRR' లాంటి పాన్ ఇండియా హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో దేశ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించి తన లుక్‌ను సైతంఅప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

ఈ సినిమా కోసం మహేశ్ తన మేకోవర్ మొత్తాన్ని చేంజ్ చేసుకొని హాలీవుడ్ హంక్ లాగా మారిపోయాడు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించి బిగ్ అప్‌డేట్ బయటికొచ్చింది. ప్రముఖ సినీ క్రిటిక్ మనోబాలా తన ఎక్స్ వేదికగా 'SSMB29' మూవీ రెండు పార్టులుగా ఉంటుందని చెబుతూనే బడ్జెట్ కూడా రివీల్ చేశారు.

1000 కోట్ల బడ్జెట్‌తో..

' సూపర్ స్టార్ #మహేశ్ బాబు గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ ఫిల్మ్ #SSMB29 భారీ రూ.1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడుతుంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించనున్న భారతదేశపు అత్యంత ఈ భారీ బడ్జెట్ చిత్రం రెండు భాగాలుగా రూపొందించబడుతుంది..' అంటూ ట్వీట్ చేశారు. 

ఈ ట్వీట్ కాస్త నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీ ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. రాజమౌళి ఈ సినిమా కోసం లొకేషన్స్ వెతికే పనిలో పడ్డారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది. 2026 లో ఫస్ట్ పార్ట్ ఆడియన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు