/rtv/media/media_files/2025/02/09/zE4wCLrt9hPjCFjeuioQ.jpg)
THANDEL HD Print
Thandel Movie: లవ్ స్టోరీ తర్వాత అక్కినేని నాగచైతన్య- సాయి పల్లవి జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'తండేల్'. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ రెస్పాన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది. అయితే సినిమా విడుదలై ఒక్కరోజులోనే మేకర్స్ కి భారీ షాక్ తగిలింది. 'తండేల్' HD ప్రింట్ ఆన్ లైన్ లో వచ్చేసింది. టెలిగ్రాం,ఐబోమ్మ లాంటి వెబ్ సైట్లలో ఈ సినిమా ఇప్పుడు విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. ఇప్పటికే కొంతమంది థియేటర్స్ కి వెళ్లకుండానే సినిమాను చూసేశారు. అంతేకాదు మూవీకి సంబంధించిన వీడియో క్లిప్ లను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
#ThandelThandavam. #Thandel @TrendsChaitu @GeethaArts @chay_akkineni #ThandelReview
— AnepalliSaikrishna (@AnepalliSaikri1) February 8, 2025
Anna hd print in ott platform within 1day
Please check and delect asap 🙏@ThandelTheMovie pic.twitter.com/73Au4LeoNz
తొలి రోజు రూ. 41.20 కోట్లు..
ఇది ఇలా ఉంటే మూడవ రోజు కూడా బుక్ మై షోలో 'తండేల్' టికెట్లు భారీగా అమ్ముడయ్యాయి. 70వేలకు పైగా బుకింగ్స్ జరిగాయి. తొలి రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 41.20 కోట్ల వసూళ్లను రాబట్టింది. వారాంతం కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు విదేశాల్లోనూ 'తండేల్' జోరు బాగానే కొసాగుతోంది. ఓవర్సీస్ లో తొలి రోజు ఈ చిత్రం 3 లక్షల 50వేల డాలర్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు మత్స్యకారుల జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని చందూ మొండేటి తెరకెక్కించారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. చై కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన తొలి చిత్రమిది. ఈ సినిమా కోసం దాదాపు రూ. 75 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం.
Also Read: Allu Aravind: బన్నీ డ్యాన్స్ చిరంజీవి నుంచి వచ్చింది కాదు.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్!