/rtv/media/media_files/2025/02/03/7w2oqOe2RqXiBT89YJ16.jpg)
monalisa with allu arjun
Monalisa: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన నీలి కళ్ళ సుందరి మొనాలిసా గురించే వినిపిస్తోంది, కనిపిస్తోంది. మహాకుంభమేళాలో రుద్రాక్ష దండలు అమ్ముకోవడానికి వచ్చిన ఈ అమ్మాయి సోషల్ మీడియాలో ఓవర్‌నైట్ సెన్షేషన్‌గా మారింది. అనుకోకుండా ఆమెకు సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో.. మోనాలిసా దశనే తిరిగింది. ఏకంగా బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన నెక్స్ట్ మూవీ ''ది డైరీ ఆఫ్ మణిపూర్' లో మోనాలిసాను కాస్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
Also Read: Mythri Movie Makers: పుష్ప2 కు బిగ్ షాక్.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఐటీ దాడులు
పుష్ప రాజ్ తో ఫోటో..
ఇది ఇలా ఉంటే.. తాజాగా మోనాలిసా చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అల్లు అర్జున్ 'పుష్ప2' పోస్టర్ ముందు దిగిన ఫొటోను షేర్ చేస్తూ .. దానికి ఓ ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించింది. ఈరోజు పోస్టర్ బయట ఉన్నవారు.. రేపు పోస్టర్ లోపల ఉండొచ్చు. ఇది కాల చక్రం.. త్వరలో ముంబైలో కలుద్దాం అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. మోనాలిసా చేసిన ఈట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
आज पोस्टर के बहार कल अंदर होंगे यही समय का चक्र है
— Monalisa Bhosle (@MonalisaIndb) February 3, 2025
जल्दी ही मुंबई में मिलेंगे
अल्लू अर्जुन पुष्पा -2 pic.twitter.com/zwEpb8x4Dp
సనోజ్ మిశ్రా తెరకెక్కించనున్న లేటెస్ట్ ఫిల్మ్ 'ది డైరీ ఆఫ్ మణిపూర్' లో మోనాలిసా రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమార్తెగా కనిపించనుంది. ప్రేమకథ, స్థానిక సమస్యల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 20 కోట్లు బడ్జెట్‌తో సినిమాను రూపొందించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కాగా.. మోనాలిసా ఏప్రిల్ నుంచి షూటింగ్ లో పాల్గొననుంది.
Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!