'హనుమాన్' మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమాని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన మోక్షజ్ఞ లుక్ సినిమాపై ఆసక్తి పెంచింది. ఈ మధ్యే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేశారు.
డిసెంబర్ 05 న ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు జరగాల్సి ఉండగా.. చివరి నిమిషంలో అది క్యాన్సిల్ అయింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే సడెన్ గా మోక్షు మూవీ లాంచింగ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంపై బాలయ్య క్లారిటీ ఇచ్చారు.
#Mokshagna సినిమా మొదలు పెట్టాల్సింది కానీ.. వాయిదా వేశాం.
— Telugu Insider (@telugu_insider) December 6, 2024
- #NandamuriBalakrishna at a shop opening in Kakinada.#Balakrishna #MokshagnaNandamuri #NBK109 #NBK #DaakuMaharaaj #DaakuMaharaajOnJan12th #TeluguInsider pic.twitter.com/7c5d8jcvRr
Also Read : డబ్బులు తక్కువిచ్చినా పర్లేదు కానీ ఫ్రీగా ఆ పని చేయను.. రష్మిక షాకింగ్ కామెంట్స్
మోక్షజ్ఞ కి గత రెండుమూడు రోజులనుంచి జ్వరంతో బాధ పడుతున్నాడని అందుకే పూజ కార్యక్రమాలు క్యాన్సిల్ చేశామని, ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. కాగా ఈ పూజా కార్యక్రమాల ఏర్పాట్లకే మేకర్స్ సుమారు రూ.25 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ సెట్స్ పైకి వెళ్లకముందే.. మరో 2 సినిమా ఆఫర్లు దక్కించుకున్నాడు. ఇందులో మొదటగా ఇటీవలే లక్కీ భాస్కర్ తో హిట్ అందుకున్న ప్రముఖ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించే సినిమాలో నటిస్తున్నాడు. రెండోది తండ్రి బాలయ్య దర్శకత్వంలో కావడం విశేషం. అప్పట్లో బాలకృష్ణ హీరోగా నటించిన 'ఆదిత్య 369' సినిమా సీక్వెల్ లో మోక్షజ్ఞ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే ఈ విషయాన్ని బాలయ్య ప్రకటించారు.
Also Read : సంధ్య థియేటర్ ఘటనపై ఎట్టకేలకు స్పందించిన బన్నీ.. బాధిత కుటుంబానికి 25 లక్షల సాయం
Also Read: సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలనుకునే వారికి గుడ్ న్యూస్..!