Chiranjeevi: శేఖర్ కమ్ముల చేయి వేయగానే చిరంజీవి ఎలా చేశారో చూడండి! వీడియో వైరల్

'కుబేర' సక్సెస్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరు చేసిన పని నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది. దర్శకుడు శేఖర్ కమ్ముల పొరపాటున మెగాస్టార్ భుజం పై చేయి వేసి ఆ తర్వాత వెంటనే తీసేశారు. ఇది గమనించిన చిరంజీవి ఆయన చేయిని మళ్ళీ భుజం పై వేయించుకున్నారు.

New Update
chiranjeevi- sekhar kammula viral video

chiranjeevi- sekhar kammula viral video

Chiranjeevi: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, రష్మిక మందన్న, ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన 'కుబేరా' తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. 100 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా తాజాగా మూవీ టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ జరుపుకుంది. అయితే ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ప్రవర్తించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇది చూసిన నెటిజన్లను.. ''ఒక వ్యక్తి పైన గౌరవం ఊరికే రాదు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండడం వాళ్ళ నైజం అంటూ మెగాస్టార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

అసలేం జరిగింది.. 

అయితే సక్సెస్ ఈవెంట్ అందరు కలిసి ఫొటో దిగుతుండగా.. మెగాస్టార్ పక్కనే నిల్చున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల పొరపాటున ఆయన భుజంపై చేయి వేశారు. ఆ తర్వాత వెంటనే భుజం పై నుంచి చేయి తీసేశారు. దీంతో ఇది గమనించిన మెగాస్టార్ శేఖర్ చేయి తీసి మళ్ళీ తన భుజం పై వేసుకున్నారు. పర్వాలేదు చేయి వేసుకో అన్నట్లుగా శేఖర్ కమ్ములకు చెప్పారు. ఇక్కడ మెగాస్టార్ ఉన్నతమైన ఆలోచన, ఎంత ఎదిగిన ఒదిగి ఉండే ఆయన తీరు అభిమానులను ఫిదా చేశాయి. 

Also Read: Chiranjeevi: యంగ్ ప్రొడ్యూసర్ తో మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్.. 'కుబేరా' ఈవెంట్ లో అదిరే అప్డేట్!

Advertisment
తాజా కథనాలు