Mohan babu: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా తిరుపతిలోని నటుడు మోహన్ బాబు యూనివర్సిటీ సంక్రాంతి సంబరాలు వేడుకగా జరిగాయి. ముగ్గుల పోటీలు, ఆట, పాటలతో యూనివర్సిటీలో సందడి వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో యూనివర్సిటీ ఛాన్సలర్ నటుడు మోహన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నటుడు మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇది కూడా చూడండి: తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్ ది సీన్స్! ట్రైలర్ చూశారా
గతం గతః.. మోహన్ బాబు వ్యాఖ్యలు..
మోహన్ బాబు మాట్లాడుతూ.. గతం గతః.. అయిపోయింది ఏదో అయిపోయింది. నిన్న జరిగింది మర్చిపోయి.. రేపు జరగాల్సిన మంచి పనుల గురించి ఆలోచించాలి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని అన్నారు. దీంతో మోహన్ బాబు ఇప్పటి వరకు కొడుకు మనోజ్ జరిగిన వివాదాలను పక్కన పెట్టేసి.. ఎప్పటిలాగే మనోజ్ తో కలిసి ఉండబోతున్నట్లు అంతా అనుకుంటున్నారు.
గత కొన్ని రోజులుగా మోహన్ బాబు, కొడుకు మనోజ్ మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. మోహన్ బాబు, మనోజ్ ఇద్దరు ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. ఈ క్రమంలో జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఘర్షణ జరగగా.. న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టు పై మోహన్ బాబు మైకుతో దాడి చేయడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మోహన్ బాబు పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. దీంతో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోరగా కోర్టు తిరస్కరించింది.
ఇది కూడా చూడండి: పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా.. హైకోర్టు సంచలన తీర్పు
Mohan babu: మంచు మనోజ్ పై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు..!
మోహన్ బాబు యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ గతం గతః..నిన్న జరిగింది మర్చిపోయి, రేపు చేయాల్సిన మంచి గురించి ఆలోచించాలి అని అన్నారు. దీంతో ఇకపై మోహన్ బాబు, మనోజ్ ఎప్పటి లాగే కలిసే ఉండబోతున్నారని టాక్.