/rtv/media/media_files/2025/01/29/tHzA1TbivmvFgATXZmdM.jpg)
mohan babu and vishnu meet Gujarat cm
Manchu Mohan Babu: ప్రముఖ టాలీవుడ్ నటుడు మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ను బుధవారం కలిశారు. ఈ మేరకు మోహన్ బాబు తన సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. గుజరాత్ సీఎంతో భేటీలో మోహన్ బాబు, మంచు విష్ణు, నటులు శరత్ కుమార్, ముఖేష్ రిషిలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ చిత్రకారుడు రమేష్ గొరిజాల గిసిన పెయింటింగ్‌ను వారు సీఎంకు బహుమతిగా అందజేశారు. ఈ భేటీపై తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మోహన్ బాబు ఎక్స్ వేదికగా ఫోటోలను పంచుకున్నారు.
Also Read: కుంభమేళాలో తొక్కిసలాట.. కన్నీరు పెట్టించే దృశ్యాలు..!
" గౌరవనీయులైన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ని, విష్ణు మంచు, శ్రీ శరత్ కుమార్, శ్రీ ముఖేష్ రిషి, శ్రీ వినయ్ మహేశ్వరిలను కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆయన మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం సర్వశక్తిమంతుడిగా ఉండాలని కోరుకుంటున్నాను. గుజరాత్ పురోగతిని నడిపించే డైనమిక్ నాయకుడిగా ఆయన విజయం కొనసాగాలని కోరుకుంటున్నాను" అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.
It was a pleasure meeting the Hon’ble Chief Minister of Gujarat, Shri Bhupendra Patel Ji, along with Vishnu Manchu, Mr. Sarath Kumar, Mr. Mukesh Rishi, and Mr. Vinay Maheshwari. I thank him for the warm reception and praise the Almighty for his good health and prosperity. As a… pic.twitter.com/iDdQDh9oLV
— Mohan Babu M (@themohanbabu) January 29, 2025
Also Read: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్ కీలక నిర్ణయం
ప్రమోషన్ లో భాగంగానే సీఎంతో మీటింగ్..
కన్నప్ప మూవీ ప్రమోషన్ లో భాగంగానే వీరంతా సీఎం భూపేంద్ర పటేల్ ని కలిసినట్లుగా తెలుస్తోంది. మంచు ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్టుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు మంచు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను 25 ఏప్రిల్ 2025న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
Also Read: వరంగల్లో పాక్ ఉగ్రవాదుల కలకలం.. బిర్యానీ సెంటర్ నడుపుతూ..!