Mirai Telugu Teaser: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘మిరాయ్’ టీజర్.. వారెవ్వా అదిరిపోయింది మచ్చా

‘హనుమాన్’ హీరో తేజ సజ్జ నటిస్తున్న కొత్త సినిమా ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. టీజర్‌లో హీరో ఎలివేషన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ అద్భుతంగా, చాలా క్లీన్ అండ్ నీట్‌గా ఉన్నాయి.

New Update

‘హనుమాన్’ హీరో తేజ సజ్జ నటిస్తున్న కొత్త సినిమా ‘మిరాయ్’. ఇందులో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విలన్ రోల్ పోషిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. టీజర్‌లో హీరో ఎలివేషన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ అద్భుతంగా, చాలా క్లీన్ అండ్ నీట్‌గా ఉన్నాయి. టీజర్ మొదట్లో మంచు మనోజ్ మాస్ యాక్షన్ అదిరిపోయింది. 

ALSO READ: 5వ తరం జెట్ ను అభివృద్ధి చేస్తున్న ఇండియా

Mirai Telugu Teaser

పవర్ ఫుల్ విలన్‌గా మనోజ్ కనిపించబోతున్నట్లు అర్థం అవుతోంది. అలాగే హీరో తేజ సజ్జను చూపించే విధానం బాగుంది. అతడు చేసే యాక్షన్ సన్నివేశాలు వేరే లెవెల్ అని చెప్పాలి. స్టన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో అచ్చం హాలీవుడ్ సినిమాను తలపించింది. ముఖ్యంగా సాహస సన్నివేశాల్లో తేజసజ్జ ఎక్కడా కాంప్రమైజ్ కానట్లు కనిపించింది. ఎలాంటి సన్నివేశాన్ని అయినా అతడు చాలా శ్రమపెట్టి చేసినట్లు అర్థం అవుతోంది. 

ALSO READ: స్టూడెంట్స్ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న ట్రంప్..వీసా ఇంటర్వ్యూలు నిలిపేయాలని  ఆదేశం

ఈ టీజర్‌ బట్టి చూస్తే ‘మిరాయ్’ ఇండియన్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక టీజర్ చివర్లో రాముని రాకను చూపించిన విజువల్స్ హైక్లాస్‌గా ఉన్నాయనే చెప్పాలి. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ చిత్రాన్ని టిజి విశ్వప్రశాద్, క్రితి ప్రసాద్ కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 5న 7 భాషల్లో రిలీజ్ కానుంది. 

mirai-movie | teja-sajja-mirai-movie | latest-telugu-news
Advertisment
Advertisment
తాజా కథనాలు