Mirai Collections: 'మిరాయ్' క‌లెక్ష‌న్ల సునామి..! బుక్‌మైషో బుకింగ్స్ దూకుడు..

తేజ సజ్జా 'మిరాయ్' బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. బుక్‌మైషోలో 20 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. తాజాగా “వైబ్ ఉందిలే” పాటను మళ్లీ సినిమా‌లో చేర్చారు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ చిత్రంతో తేజ సజ్జా క్రేజ్‌ మరింత పెరిగిందనే చెప్పాలి.

New Update
Mirai Collections

Mirai Collections

Mirai Collections: తేజ సజ్జా(Teja Sajja) హీరోగా నటించిన 'మిరాయ్' సినిమా ఇటీవల విడుదలై మరో గొప్ప విజయాన్ని అందుకుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం, విడుదలైనప్పటి నుండి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబడుతూ, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే భారీ లాభాలను నమోదు చేసిన ఈ చిత్రం, తాజాగా బుక్‌మైషోలో 20 లక్షల టికెట్లు అమ్ముడుపోవడంతో మరో రికార్డు నెలకొల్పింది. ఇటీవలి కాలంలో ఈ స్థాయి టికెట్ అమ్మకాలు సాధించగలిగిన తెలుగు సినిమాలు చాలా తక్కువే.

ఈ సినిమాలో తేజ సజ్జా నటనకు విశేషమైన ప్రశంసలు దక్కుతున్నాయి. మిరాయ్ సినిమా ద్వారా ఆయనకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ విజయంతో తేజ సజ్జా కెరీర్‌లో మరో మెట్టు ఎక్కినట్లయ్యింది. ఇప్పుడు ఆయన తర్వాతి సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!

ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా, టీ.జి. విశ్వ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియా శరణ్, జగపతి బాబు, జయరామ్, గెటప్ శ్రీను వంటి ప్రముఖులు ముఖ్య పాత్రల్లో నటించారు. గౌర హరి సంగీతాన్ని అందించగా, సినిమాకు సంబంధించిన విజువల్స్, భావోద్వేగాలు, థ్రిల్ కలిగించే కథాకథనాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

అయితే, సినిమా విడుదలకు ముందు "వైబ్ ఉందిలే" అనే పాట బాగా వైరల్ అయింది. అయితే ఈ పాటను థియేటర్ వెర్షన్ లో కట్ చేసారు.  దర్శక నిర్మాతలు కథకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో తొలగించారని అప్పట్లో చెప్పారు. కానీ, ప్రేక్షకుల డిమాండ్‌తో ఇప్పుడు ఆ పాటను మళ్లీ సినిమా‌లో చేర్చారు. ప్రస్తుతం నాలుగో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా, కొత్తగా చేర్చిన పాటతో మళ్ళీ థియేటర్ల వద్ద సందడి చేస్తోంది. మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Also Read: తెలుగులో మాట్లాడు..? కాంతార హీరోపై నెటిజన్స్ ఫైర్

మొత్తానికి, మిరాయ్ సినిమా తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకుంది. తేజ సజ్జా నటన, కర్తీక్ ఘట్టమనేని దర్శకత్వం, సాంకేతిక విలువలు అన్నీ కలిసి సినిమాకు విజయాన్ని తెచ్చిపెట్టాయి. ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి!

Advertisment
తాజా కథనాలు