ఆ హీరోతో పెళ్లి.. ఎట్టకేలకు నోరు విప్పిన మీనాక్షి చౌదరి

'మెకానిక్ రాకీ' ప్రమోషన్లలో పాల్గొన్న మీనాక్షి చౌదరి పెళ్లి రూమర్స్ పై నోరు విప్పింది.' నేను పెళ్లి చేసుకోవడం లేదు. నా పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. ప్రస్తుతానికి నేను సింగిల్‌. ఇప్పుడైతే నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు..' అని తెలిపింది.

New Update
meena

టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి కెరీర్ పరంగా జెట్ స్పీడ్ లో దూసుకుకెళ్తోంది. హిట్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తోంది. ప్రెజెంట్ తెలుగులోనే అరడజను సినిమాలు చేస్తోంది. ఇటీవల 'లక్కీ భాస్కర్' మూవీతో భారీ సక్సెస్ అందుకుంది. ఈ శుక్రవారం 'మెకానిక్ రాకీ' అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. 

ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా మీనాక్షి.. అక్కినేని హీరో సుశాంత్ తో ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందని వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై ఎట్టకేలకు మీనాక్షి నోరు విప్పింది. 'మెకానిక్ రాకీ' ప్రమోషన్లలో పాల్గొన్న మీనాక్షి చౌదరిని ఓ అభిమాని ఇటీవల సుశాంత్‌ను మీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. 

Also Read: AP:అయ్యప్ప భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఏపీ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు

అదంతా ఫేక్..

దీనిపై మీరేమంటారు? అని అడగ్గా.. ఆమె బదులిస్తూ..' అదంతా ఫేక్. నేను పెళ్లి చేసుకోవడం లేదు. గతనెల కూడా ఒక రూమర్‌ వచ్చింది. ఓ తమిళ నటుడి కుమారుడిని పెళ్లి చేసుకుంటున్నట్లు రాశారు. ప్రతినెల నాపై ఏదో ఒక రూమర్ వస్తోంది. అలాగే ఇప్పుడు నా పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. ప్రస్తుతానికి నేను సింగిల్‌. ఇప్పుడైతే నాకు పెళ్లి  చేసుకునే ఉద్దేశం లేదు. 

అలాంటిది ఏమైనా ఉంటే నేనే స్వయంగా నా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా చెబుతాను..' అంటూ చెప్పుకొచ్చింది. దీంతో మీనాక్షి పెళ్లి రూమర్స్ కు చెక్ పడినట్లయింది. ఇక 'మెకానిక్ రాకీ' విషయానికొస్తే.. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మొదటి సారి విశ్వక్ సేన్ తో కలిసి నటించింది. 

Also Read: TG-TET: నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు

రవితేజ ముళ్లపూడి డైరెక్టుగా చేసిన ఈ మూవీ ఇప్పటికే ప్రమోషనల కంటెంట్ తో ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. మాస్‌ యాక్షన్, లవ్, సెంటిమెంట్‌ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 22 న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

ఇది కూడా చదవండి: నిండా ముంచిన సువర్ణ భూమి.. లాభాల ఆశ చూపి రూ.200 కోట్లు స్వాహా!

ఇది కూడా చదవండి: అగ్రస్థానంలో హైదరాబాద్‌.. ఢిల్లీ, ముంబైని మించి ఆర్థికాభివృద్ధి!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు