BREAKING: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారు, ఫోన్ సీజ్! TG: కౌశిక్‌రెడ్డి సెల్‌ఫోన్‌ను బంజారాహిల్స్ పోలీసులు సీజ్ చేశారు. తన ఫోన్ ట్యాప్ చేశారని బంజారాహిల్స్ పీఎస్‌లో ఎస్సై విధులకు ఆటంకం కలిగించారని ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పోలీసులు ఆయన కారుతో పాటు ఫోన్‌ను సీజ్ చేసినట్లు సమాచారం. By V.J Reddy 08 Dec 2024 in తెలంగాణ Short News New Update షేర్ చేయండి MLA Koushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి పోలీసులు మరో షాక్ ఇచ్చారు. ఆయన సెల్‌ఫోన్‌ను బంజారాహిల్స్ పోలీసులు సీజ్ చేశారు. తన ఫోన్ ట్యాప్ చేశారని బంజారాహిల్స్ పీఎస్‌కు ఎస్సై విధులకు ఆటంకం కలిగించారని ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పోలీసులు ఆయన కారుతో పాటు ఫోన్‌ను సీజ్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లాక్ కోడ్ చెప్పడానికి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నిరాకరించడంతో పోలీసులు సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. కాగా పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడిని కేవలం రాజకీయ కక్షతోనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని మండిపడుతున్నారు. కౌశిక్ రెడ్డిపై మరో కేసు... కౌశిక్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీసులను బెదిరించారని ఆయనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు చేశారు. అరెస్టు కోసం వెళ్లినప్పుడు చనిపోతానని బెదిరించినట్లు FIRలో పేర్కొన్నారు. కాగా మరోసారి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది. అయితే రెండ్రోజుల క్రితం పాడి కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత బెయిల్ పై ఆయన విడుదల అయ్యారు. పోలీస్ స్టేషన్ లో రచ్చ... బుధవారం సాయంత్రం తన ఫోన్ ట్యాప్ చేశారని కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట హల్ చల్ చేశారు. పోలీసులు ఫిర్యాదు ఇచ్చినా పట్టిచుకోవడం లేదని పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించాారు. పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషల్ లో విధులకు ఆటంకం కలిగించారని సీఐ రాఘవేంద్ర ఫిర్యాతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన పై కేసు నమోదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డితోపాటు ఆయన అనుచరులు 20 మంది మీద పోలీసులు పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి