రేషన్ మాఫియాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. క్లారిటీ!

AP: కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులకు తనకు సంబంధం లేదని అన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి. తన కుటుంబసభ్యుల ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. క్కడి ఎగుమతిదారుల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి వియ్యంకుడు శ్రీనివాస్‌ కూడా ఉన్నారని అన్నారు.

New Update
Dwarampudi: మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి షాక్

Dwarampudi Chandrashekar: ఏపీ రాజకీయాల్లో కాకినాడలో రేషన్ బియ్యం అక్రమ రవాణా ప్రకంపనలు సృష్టించింది. ఈ రేషన్ మాఫియా వెనుక వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఉన్నారంటూ టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే తాజాగా జరుగుతున్న ఈ ప్రచారంపై ద్వారంపూడి స్పందించారు. కావాలనే కొందరు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులకు తనకు సంబంధం లేదని, తన కుటుంబసభ్యుల ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. క్కడి ఎగుమతిదారుల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి వియ్యంకుడు శ్రీనివాస్‌ కూడా ఉన్నారని కుండబద్దలు కొట్టారు.

ఇది కూడా చదవండి: నేడు ఎర్రవెల్లిలో KCR కీలక సమావేశం

అనేక దేశాల్లో తిండి లేక...

నిన్న తన నివాసంలో మీడియాతో మాట్లాడారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి. ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి  సమయంలో కాకినాడ నుంచి బియ్యం ఎగుమతి జరగకపోవడంతో అనేక దేశాల్లో ఆహార కొరత ఏర్పడిందని.. తిండి లేక ప్రజలు చనిపోయేవారని అన్నారు. దేశంలో 98 శాతం బియ్యం ఎగుమతులు  2019-24 మధ్య కాకినాడ నుంచే జరిగాయని వివరించారు. ఇప్పుడు ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం.. కాకినాడ పోర్టు నుంచి రేషన్‌ బియ్యం అక్రమంగా ఎగుమతి చేస్తున్నారని ప్రచారం చేయడంతో ఎగుమతిదారులు ఇతర పోర్టులకు వెళ్తున్నారని తెలిపారు.

ఇది కూడా చదవండి: BREAKING: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారు, ఫోన్ సీజ్!

కాకినాడ పోర్టు నుంచి పచ్చిబియ్యం ఎగుమతులు ఆగిపోతే ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ధాన్యాన్ని ఎవరు కొనరాని.. ఇందు వల్ల రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదురుకునే అవకాశం ఉందని అన్నారు.  కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులకు తనకు సంబంధం లేదని, తన కుటుంబసభ్యుల ప్రమేయం లేదని ఆయన తేల్చి చెప్పారు. కాకినాడ పోర్టులకు వచ్చే బియ్యంలో 75 శాతం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బిహార్‌ రాష్ట్రాల నుంచి వస్తున్నాయని పేర్కొన్నారు. ఇక్కడి ఎగుమతిదారుల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి వియ్యంకుడు శ్రీనివాస్‌ కూడా ఉన్నట్లు చెప్పారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు